close

తాజా వార్తలు

తండ్రి అంత్యక్రియల అనంతరం..ఓటేసిన కొడుకు

ఛతర్‌పూర్: తనను కన్న తండ్రి ఇక లేరని, ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారనే బాధను దిగమింగి ఓ వ్యక్తి ఓటేసేందుకు వచ్చారు. ప్రజాస్వామ్యభారతంలో అరుదైన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలింగ్‌ బూత్‌లోకి తడిసిన తెల్లబట్టలతో వచ్చిన ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎలాగైనా ఓటేయాలనే ఆయన పట్టుదలను అక్కడి వారంతా మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఐదో విడతలో కొన్నిస్థానాల్లో పోలింగ్‌ నిర్వహించారు.  మిగిలిన రెండు విడతల పోలింగ్‌ ముగిసిన అనంతరం మే23న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.