close

తాజా వార్తలు

సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

దిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పదో తరగతి ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. సుమారు 18లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.ఫలితాల్లో 91.1శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 13 మంది విద్యార్థులు 499/500 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29 వరకు ఈ పరీక్షలు జరిగాయి. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోని 98 పరీక్షా కేంద్రాల నుంచి మొత్తం 40,296 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. దేశంలో దిల్లీ నుంచి అత్యధికంగా సీబీఎస్‌ఈ పరీక్షలకు హాజరయ్యారు. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.