close

తాజా వార్తలు

కేదార్‌ జాధవ్‌ గాయంపై సందిగ్ధత

ప్రపంచకప్‌ నేపథ్యంలో టీమిండియా ఆందోళన

చెన్నై: మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌ ముందు టీమిండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాధవ్‌ గాయం బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కింగ్స్‌ XI పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అతడి భుజానికి గాయమైంది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో రవీంద్ర జడేజా వేసిన ఓవర్‌త్రోను ఆపబోయి జాధవ్‌ ఎడమవైపు డైవ్‌ చేశాడు. దీంతో అతడు కిందపడి ఎడమ భుజానికి గాయమైంది. అప్పటికప్పుడే మ్యాచ్‌ నుంచి నిష్క్రమించి తిరిగి ఆడలేదు. 

ఈ గాయం గురించి చెన్నై సభ్యుడొకరు మాట్లాడుతూ.. ఇది తీవ్రమైన గాయంగానే కనిపిస్తోందని, జాధవ్‌ కోలుకోవడానికి రెండు వారాల సమయం పడుతుందని చెప్పాడు. ఈ నేపథ్యంలో జాధవ్‌ ఇకపై ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ ఆడకపోవచ్చని స్పష్టంచేశాడు. కాగా మే 30 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచకప్‌ జట్టులో చేరాలంటే అతడు పూర్తిగా కోలుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అతడు త్వరగా కోలుకోవాలని టీమిండియా ఆశిస్తోంది. కాగా ఆదివారం రాత్రి చెన్నై ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ అనంతరం ఆ జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మీడియాతో మాట్లాడారు. 

‘కేదార్‌ జాధవ్‌కి ఎక్స్‌రే, స్కానింగ్‌ చేస్తున్నాం. అతడు త్వరగా కోలుకుంటాడనుకుంటున్నా. ఇకపై ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ ఆడతాడని అనుకోవట్లేదు. తన తదుపరి ధ్యాసంతా ప్రపంచకప్‌పైనే ఉంటుంది. ప్రస్తుతం అతడు కాస్త ఇబ్బందిగానే ఉన్నాడు. ఏదేమైనా వైద్య పరీక్షల అనంతరం కచ్చితమైన సమాచారం తెలుస్తుంది. చేతి వేళ్లు మడతపడ్డాయి. అదేమీ పెద్ద ఇబ్బంది కాదు’ అని ఫ్లెమింగ్‌ పేర్కొన్నాడు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.