close

తాజా వార్తలు

ఆదాయం అర్ధబిలియన్‌కు చేరాలి: ఇన్ఫీ లక్ష్యం  

బెంగళూరు: సాఫ్ట్‌వేర్‌ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వచ్చే మూడేళ్లలో దేశీయంగా తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంది. ప్రస్తుతం భారత్‌ నుంచి ఇన్ఫోసిస్‌కు 270 మిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తోంది. ఇది మొత్తం కంపెనీ ఆదాయంలో 2.3శాతం. ఈ నేపథ్యంలో భారత్‌లో 500 మిలియన్‌ డాలర్ల ఆదాయం పొందాలన్నది లక్ష్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేరకు భారత్‌లో అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తోంది. 
జనవరిలో ఇన్ఫీ దాదాపు 4,200 కోట్లు విలువైన ఆదాయపు పన్నుశాఖకు చెందిన కాంట్రాక్టును దక్కించుకొంది. ఈ కంపెనీ  ఇప్పటికే ఐటీ శాఖకు చెందిన సీపీసీ ప్రాజెక్టును కూడా నిర్వహిస్తోంఇ. 2015లో కంపెనీ రూ.1,380 కోట్ల విలువైన జీఎస్‌టీ నెట్‌వర్క్‌ తయారీ, నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకొంది. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.