Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 96069
            [news_title_telugu_html] => 

మాలో అత్యుత్తమ ఫినిషర్‌ అతడే: షా

[news_title_telugu] => మాలో అత్యుత్తమ ఫినిషర్‌ అతడే: షా [news_title_english] => Pant is the best finisher among youngsters says Shaw [news_short_description] => దిల్లీ క్యాపిటల్స్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ ప్రస్తుత యువతరంలో అత్యుత్తమ ఫినిషర్‌ అని సహచర ఆటగాడు పృథ్వీషా ప్రశంసించాడు. అతడి వల్లే దిల్లీ రెండో క్వాలిఫయర్‌ చేరుకుందని వెల్లడించాడు.... [news_tags_keywords] => rishabh pant,prithvi shaw,ipl 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 3 [news_videolink] => | | [news_videoinfo] => | | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-09 20:49:18 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మాలో అత్యుత్తమ ఫినిషర్‌ అతడే: షా - Pant is the best finisher among youngsters says Shaw - EENADU
close

తాజా వార్తలు

మాలో అత్యుత్తమ ఫినిషర్‌ అతడే: షా

విశాఖ: దిల్లీ క్యాపిటల్స్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ ప్రస్తుత యువతరంలో అత్యుత్తమ ఫినిషర్‌ అని సహచర ఆటగాడు పృథ్వీషా ప్రశంసించాడు. అతడి వల్లే దిల్లీ రెండో క్వాలిఫయర్‌ చేరుకుందని వెల్లడించాడు. ఎలిమినేటర్‌ పోరులో హైదరాబాద్‌ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్య ఛేదనలో పంత్‌ విజృంభించి ఆడాడు. ఒత్తిడిని అధిగమించి 21 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. అందులో ఐదు సిక్సర్లు ఉన్నాయి.

‘టీ20ల్లో చాలా ఒత్తిడి ఉంటుంది. మేం గెలవాలని ప్రార్థన చేశా. పంత్‌ అద్భుతంగా ఆడాడు. యువ ఆటగాళ్లలో అతడే అత్యుత్తమ ఫినిషర్‌. అతనెప్పుడూ మా కోసం మ్యాచ్‌లు మలుపుతిప్పుతాడు. అద్భుతంగా ఆడతాడు. దురదృష్టవశాత్తు పంత్‌ మ్యాచ్‌ను ముగించలేదు. చివర్లో కీమోపాల్‌ ఆ పనిచేశాడు. మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్లు ఎంతో కీలకం. అప్పుడు పరుగులు చేస్తే తర్వాతి బ్యాట్స్‌మెన్‌కు పని సులభం అవుతుంది. బౌలర్లు కట్టర్లు వేస్తుండటంతో బంతిని లాగి కొట్టడం ఇబ్బందిగా అనిపించింది. అందుకే చెత్తబంతుల కోసం ఎదురుచూశా’ అని పృథ్వీషా అన్నాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.