close

తాజా వార్తలు

కాస్త వార్తా పత్రికలు చదవండి: పంజాబ్ సీఎం 

భాజపా అభ్యర్థి సన్నీదేవోల్‌ మీద కాంగ్రెస్‌  విమర్శలు

గురుదాస్‌పుర్: దేశంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకోడానికి వార్తాపత్రికలు, టీవీ చూడాలని గురుదాస్‌పుర్ భాజపా అభ్యర్థి సన్నీ దేవోల్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సూచించారు. భాజపా ఆయన్ను ఒత్తిడి చేసి ఎన్నికల్లో పోటీ చేసేలా చేసిందని విమర్శలు చేశారు. శనివారం గురుదాస్‌పుర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్‌కు ఇక్కడేమీ లేదని, ఎన్నికలు పూర్తైన తరవాత ఆయన ముంబయికి వెళ్లిపోతారన్నారు. ఈ ప్రాంతం గురించి ఏమీ తెలీకుండా ఎలా అభివృద్ది చేపడతారని విమర్శించారు. ‘భాజపా ఒత్తిడి మీద ఆయన ఇక్కడకు వచ్చారు. ఆయనకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తిపాస్తులున్నట్లు గతంలో పత్రికల్లో చదివాను. ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆదాయ పన్ను దాడులు నిర్వహిస్తామని  భాజపా బెదిరించింది. సాధారణంగా భాజపా ప్రత్యర్థులను అలాంటి చర్యలతోనే బెదిరిస్తుంది . అందుకే ఆయన పోటీకి అంగీకరించారు. కొద్దిరోజుల క్రితం టీవీ చూస్తున్నప్పుడు ఒక యాంకర్‌ బాలాకోట్ దాడుల గురించి మీ అభిప్రాయమేంటని ఆయన్ను అడగ్గా..అసలు అవేంటీ? అని ఎదురు ప్రశ్నించారు. అసలు రాజకీయాల గురించే తెలీనప్పుడు, ఇందులోకి ఎందుకు వచ్చారు? దేశంలో పరిణామాలను తెలుసుకోడానికి వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు చూడాలి’ అని సింగ్ విమర్శలు చేశారు. 
‘దేవోల్ ముంబయి వాసి. ఆయన ఇల్లు ముంబయిలోనే ఉంది. ఆయన కార్యకలాపాలన్నీ అక్కడే. ఇక ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది?. అయన ఎట్టిపరిస్థితుల్లోను మాకు బలమైన ప్రత్యర్థి కానేకాదు’ అని వెల్లడించారు. ఆయన ఒకవేళ ఇక్కడి నుంచి ఎన్నికైనా, తరవాత మీకు ముఖం చూపిస్తారా అని ఓటర్లను ప్రశ్నించారు. ‘ఆయనకు గుడ్‌బై చెప్పడం మంచింది. కావాలంటే ఆయనతో సెల్ఫీలు దిగండి’ అని ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్ జాఖడ్‌ ముందు చూపు కలిగిన వ్యక్తని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని సింగ్ వెల్లడించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.