close

తాజా వార్తలు

వెల్దుర్తి ఘటనతో షాక్‌కు గురయ్యా: లోకేశ్‌

అమరావతి: కర్నూలు జిల్లా వెల్దుర్తి చెక్‌పోస్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతులకు ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ , జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సంతాపం ప్రకటించారు. ఈ ఘటన తనను షాక్‌కు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తూ ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తెదేపా తరఫున అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

కర్నూలు ఎస్పీకి హోంమంత్రి ఫోన్‌!
మృతుల కుటుంబాలకు హోంమంత్రి చినరాజప్ప ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంపై కర్నూలు ఎస్పీ ఫకీరప్పతో హోంమంత్రి ఫోన్‌లో మాట్లాడారు. మృతదేహాలను స్వస్థలాలకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.