close

తాజా వార్తలు

ముంబయి ఇండియన్స్‌ విజయోత్సవ ర్యాలీ

భారీగా తరలివచ్చిన అభిమానులు

ముంబయి: హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆదివారం చెన్నైతో జరిగిన ఐపీఎల్‌ 12వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రోహిత్‌ సేన ఒక్క పరుగుతో గెలుపొందిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం హైదరాబాద్‌లో విజయోత్సవ సంబరాలు జరుపుకొన్న ఆ జట్టు ఆటగాళ్లు.. సోమవారం సొంతగడ్డపై భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముంబయి చేరుకున్న జట్టుని యాజమాన్యం ఓపెన్‌టాప్‌ బస్సులో ఘనంగా ఊరేగించింది. ముంబయి ఆటగాళ్లందరూ బస్సు టాప్‌పై నిల్చొని అభిమానులకు అభివాదం చేశారు. ఈ ర్యాలీని తిలకించడానికి ముంబయి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.