close

తాజా వార్తలు

17న ఎడ్‌సెట్‌ ఫలితాలు

అమరావతి: ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను విద్యాశాఖ అధికారులు విజయవాడలో ప్రకటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో మే 6న 56 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 13వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

18న ఎంసెట్‌ ఫలితాలు
అలాగే, ఈ నెల 18న మధ్యాహ్నం ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు జరిగిన ఏపీ ఎంసెట్‌కు తెలంగాణ, ఏపీల నుంచి 2,82,901మంది విద్యార్థులు హాజరయ్యారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.