close

తాజా వార్తలు

గువాహటిలో పేలుడు.. ఆరుగురికి గాయాలు


గువాహటి: అసోం గువాహటిలోని జూ పార్కు రోడ్డులోని ఓ మాల్‌ ఎదుట పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం దగ్గర్లోని గువాహటి మెడికల్‌ కళాశాలకు తరలించారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. అయితే ఇది గ్రెనేడ్‌ పేలుడు అని తెలుస్తోంది. పరేశ్‌ బరూహ్‌ నేతృత్వంలోని ఉగ్రవాద సంస్థ యూఎల్‌ఎఫ్‌ఏ..  ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని ప్రకటించుకుంది. ఈ పేలుడు ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు గువాహటి నగర పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.