
తాజా వార్తలు
న్యూదిల్లీ: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో నిన్న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగించాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం మొదటిసారి 324 అధికరణాన్ని ప్రయోగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు రాత్రి 10 గంటల నుంచే ఎన్నికల ప్రచారం ముగించాలని ఈసీ ఆదేశించింది. చివరి దశ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లో ఇంకా 9 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈసీ నిర్ణయంతో ఈ తొమ్మిది నియోజక వర్గాల్లో రేపటితో ఎన్నికల ప్రచారం ముగిసిపోనుంది. ‘‘324 అధికరణాన్ని ప్రయోగించడం బహుశా ఇదే మొదటిసారి. ఈశ్వరచంద్ర విద్యా సాగర్ విగ్రహం ధ్వంసం కావడం పట్ల ఈసీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని రాష్ట్ర అధికారులు గుర్తించి, అదుపులోకి తీసుకుంటారని భావిస్తున్నాం’’ అని ఎన్నికల అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. చివరి దశ ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లో ప్రచార గడువు శుక్రవారంతో ముగియనుంది. మే 19న ఎన్నికలు జరుగుతాయి.. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
