close

తాజా వార్తలు

కేఎల్‌ రాహుల్‌ @ 4: వెంగ్‌సర్కార్‌

దిల్లీ: ప్రపంచకప్‌లో స్ట్రోక్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని టీమిండియా మాజీ సారథి వెంగ్‌సర్కార్‌ సూచించారు. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై విజయవంతం అయ్యేందుకు అతడి టెక్నిక్‌ సరిపోతుందని వెల్లడించారు. కోహ్లీసేన సెమీస్‌కు సునాయాసంగా చేరుకుంటుందని వెంగీ ధీమా వ్యక్తం చేశారు.

‘మనకు ధావన్‌, రోహిత్‌ రూపంలో స్థిరమైన ఓపెనింగ్‌ జోడీ ఉంది. మూడో స్థానంలో విరాట్‌ కోహ్లీ అద్భుతంగా ఆడతాడు. అందుకే నాలుగో స్థానంలో కేఎల్‌ రాహుల్‌ సరైన ఎంపిక. తన టెక్నిక్‌తో టాప్‌ ఆర్డర్‌కు సహకారం అందించగలడు. నాలుగో స్థానంలో స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌ ఆడాలని కోరుకుంటున్నా’ అని వెంగ్‌సర్కార్‌ వెల్లడించారు. 1979, 1983, 1897 ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన వెంగీ ఇంగ్లాండ్‌లోనే రెండు ప్రపంచకప్‌లు ఆడారు. అందుకే రాహుల్‌ టెక్నిక్‌ అక్కడి పిచ్‌లకు సరిపోతుందని వెల్లడించారు.

‘టీమిండియా త్వరగా టాప్‌ ఆర్డర్‌ వికెట్లు చేజార్చుకుంటే స్పెషలిస్టు ఓపెనర్‌ అయిన రాహుల్‌ జట్టుకు నిలకడ ఇవ్వగలడు. టోర్నీ సుదీర్ఘంగా సాగుతుంది కాబట్టి అవసరమైతే ఓపెనింగ్‌ చేయగలడు. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉండాల్సిందే. ఇంగ్లాండ్‌లో వాతావరణానికి అలవాటు పడడం అత్యంత కీలకం. భారత్‌ గతేడాది ఇదే సమయంలో ఆడడం సానుకూల అంశం. కుల్‌దీప్‌, యుజువేంద్ర చాహల్‌ కచ్చితంగా రాణించగలరు. భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా కచ్చితంగా సెమీస్‌ చేరుకుంటాయి. మరో జట్టు ఏదో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే’ అని వెంగ్‌సర్కార్‌ పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.