close

తాజా వార్తలు

భాజపాకు ఆంధ్రా, తమిళనాడులో 0

మమతా బెనర్జీ ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు

కోల్‌కతా: తుది దశ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం ముగిసింది. సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని కూల్చిన తర్వాత ఆ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా ప్రచారాన్ని ఒక రోజు ముందే నిలిపివేయాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ గురువారం రాత్రి 10గంటలకు ప్రచారం ముగిసింది. ఇందులో భాగంగా ఈ ఎన్నికల చివరి ప్రచార సభలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ఫలితాల తర్వాత భాజపాకు ఎన్ని స్థానాలు వస్తాయో ఆమె జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ..

‘ఎన్నికల ఫలితాల్లో భాజపాకు 300 స్థానాలు వస్తాయని ఆ పార్టీ గొప్పలు చెప్పుకుంటోంది. ప్రచార సభ వేదికగా చెబుతున్నా ఆ పార్టీకి కనీసం 100 సీట్లు కూడా రావు. ఆంధ్ర ప్రదేశ్‌లో భాజపాకు 0 సీట్లు, తమిళనాడులో 0, మహారాష్ట్రలో 20 మాత్రమే వస్తాయి. ఇలా ఆ పార్టీ 200 స్థానాలను కోల్పోతుంది. భాజపా గూండా పార్టీ. డబ్బులను వెచ్చించి ఓట్లను కొనుక్కుంటోంది. ప్రజలపై తమ విధానాలను బలవంతంగా రుద్దుతోంది. మే 23 తర్వాత ఆ పార్టీ దేశంలో ఉనికిని కోల్పోతుంది’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈనెల 19న జరగనున్న చివరి దశ ఎన్నికల్లో భాగంగా బెంగాల్‌లో 9 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.