close

తాజా వార్తలు

అది చాలా పెద్ద మాట: కేఎల్‌ రాహుల్‌

 ఐపీఎల్‌లో క్రిస్‌గేల్‌తో ఆడటం వల్ల చాలా నేర్చుకున్నా

ఇంటర్నెట్‌డెస్క్‌: మే 30 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచకప్‌లో టీమిండియా నాలుగో స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. బీసీసీఐ సెలెక్షన్‌ కమిటి విజయ్‌శంకర్‌, కేఎల్‌ రాహుల్‌ను ఆ స్థానానికి ఎంపిక చేసిన విషయమూ తెలిసిందే. అయితే ఇంగ్లండ్‌ పిచ్‌లపై వీరు ఎలా రాణిస్తారో వేచి చూడాలి. నాలుగోస్థానంలో ఆడటంపై స్పందించిన రాహుల్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మీడియా అడిగిన ప్రశ్నకు జట్టులో సభ్యుడిగా ఉన్నప్పుడు యాజమాన్యం నిర్ణాయానికి కట్టుబడి ఉంటానని చెప్పాడు. ఇదే విషయంపై టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి స్పందిస్తూ.. ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు తగ్గట్టు జట్టులో మార్పులు ఉంటాయని చెప్పాడు. 

రాహుల్‌ పీటీఐతో మాట్లాడుతూ.. ‘గత కొద్ది నెలలుగా బ్యాట్‌తో బాగా రాణించా. ఇంగ్లండ్‌ లయన్స్‌తో ఆడటం వల్ల తగిన సమయం దొరికి నా నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నా. ఆ తర్వాత ఆసీస్‌తో టీ20 సిరీస్‌, ఐపీఎల్‌లో బాగా ఆడా. ఇప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నా. గత డిసెంబర్‌లో భారత్‌.. ఆసీస్‌ పర్యటనలో మెరుగ్గా ఆడలేకపోవడం నిజమే, కానీ ప్రతీ ఒక్కరూ బాగా ఆడాలనే కోరుకుంటారు. ఫామ్‌ అనేది చాలా పెద్ద మాట. ఆ సమయంలో నా బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ప్రతీ ఒక్కరూ కెరీర్‌లో ఒడుదొడుకులు ఎదుర్కొంటారు. వీలైనంతమేరకు బాగా ఆడాలనే అనుకుంటా. బంతిని కొడితే బాగా ఆడినట్టు కొట్టకపోతే ఫామ్‌ కోల్పోయినట్టు కాదు. దాని గురించి అతిగా ఆలోచించడం తల పట్టుకుని కూర్చోలేను’ అని పేర్కొన్నాడు.

ప్రపంచకప్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఇంగ్లండ్‌లో ఎలా ఆడాలో నాకు తెలుసు. గతేడాది అక్కడ పర్యటించడం వల్ల పరిస్థితులు అర్థం చేసుకోగలిగాను. గతంలో ఎలా ఆడామనేది కాదు. ఎన్ని పరుగులు చేశామని ఎవరూ పట్టించుకోరు. ఈసారి మంచిగా ఆడేందుకు సన్నద్దమయ్యాం. గత రెండు నెలలుగా విరామం లేకుండా టీ20 ఆడాము. ఇకపై వన్డేల్లో ఆడాల్సి ఉంది. ఫార్మాట్ల గురించి చింతించాల్సిన అవసరం లేదు. అదేమీ పెద్ద సమస్య కాదు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటమే ముఖ్యం. ఇక ఐపీఎల్‌లో క్రిస్‌గేల్‌తో ఆడటం వల్ల చాలా నేర్చుకున్నా’ అని రాహుల్‌ వివరించాడు.

కాఫీ విత్‌ కరణ్‌ షో కాంట్రవర్సీకి ముందు ఆస్ట్రేలియా సిరీస్‌లో ఘోరంగా విఫలమైన రాహుల్‌ తర్వాత జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఆ సమయంలో ఇండియా ఏ తరఫున ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టుపై ఆడి మంచి పరుగులు సాధించాడు. అనంతరం ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ బాగా రాణించాడు. రెండు మ్యాచుల్లో 50, 47 పరుగులు చేసి అదే ఫామ్‌ను ఐపీఎల్‌లో కొనసాగించాడు. ఈ సీజన్‌లో 593 పరుగులతో ఐపీఎల్‌లో రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.