close

తాజా వార్తలు

మహిళందరికీ సెల్యూట్‌: రాహుల్‌ గాంధీ

దిల్లీ: ఈ లోక్‌సభలో ఎన్నికల్లో భాగస్వాములైన మహిళందరికీ సెల్యూట్ అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదివారం ట్వీట్‌ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థులతో పాటు పెద్ద ఎత్తున్న ఓటింగ్‌లో పాల్గొన్న మహిళలకు వందనాలంటూ ఆయన అన్నారు. ‘ ఈ రోజు చివరి విడత పోలింగ్‌. దేశంలోని తల్లులు, సోదరీమణులంతా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. కేవలం అభ్యర్థులుగా మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారందిరికీ నా సెల్యూట్‌ ’ అంటూ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు మాకు సమాన అవకాశాలు, గౌరవం కావాలంటూ మహిళలు కోరుతున్న ఓ వీడియోని ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. తుది విడతలో భాగంగా ఆదివారం దేశ వ్యాప్తంగా 59 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.