close

తాజా వార్తలు

ఝార్ఖండ్‌లో 52.89%..బిహార్‌లో 36.20%

 

దిల్లీ:లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఘర్షణల మినహా మిగతా చోట్ల ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 41.41% పోలింగ్‌ నమోదైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రం(15,256 అడుగులు)హిమాచల్‌ ప్రదేశ్‌లోని తాషిగనగ్‌ గ్రామంలో రికార్డు స్థాయిలో రెండు గంటల్లోపే 53% పోలింగ్‌ జరిగినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.  అక్కడ కేవలం 49 మంది మాత్రమే ఓటర్లున్నారు.
ఇక బిహార్‌లో 36.20%, హిమాచల్‌ ప్రదేశ్‌లో  43.73%, మధ్య ప్రదేశ్‌లో 46.03%, పంజాబ్‌లో 37.89%, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 37%  , పశ్చిమ బెంగాల్‌లో 49.79%, ఝార్ఖండ్‌లో 52.89%, చండీఘడ్‌లో 37.50% పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.