close

తాజా వార్తలు

ఆ రాష్ట్రాల్లో మళ్లీ పుంజుకున్న భాజపా?

ఇంటర్నెట్‌డెస్క్‌: లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌లా భావించిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీసగఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. అంతకు ముందు తిరుగులేని శక్తిలా ఉన్న భాజపా.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ మూడు రాష్ట్రాల్లో భాజపా తిరిగి పుంజుకుందని ఆదివారం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల ద్వారా తెలుస్తోంది.

మధ్యప్రదేశ్‌లో..

 ఇండియా టుడే ఆక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం... భాజపా ఆధ్వర్యంలోని ఎన్డీఏకి మధ్యప్రదేశ్‌లో 26-28 సీట్లు వస్తాయి. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ కేవలం 1 నుంచి 3 సీట్ల మధ్యే గెలుచుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఎన్డీఏకు ఓట్ల శాతం 57 రానుంది. యూపీఏకి 33 శాతం, ఇతరులకు 10 శాతం ఓట్లు పడతాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 29 లోక్‌సభ సీట్లు ఉన్నాయి.

 మధ్యప్రదేశ్‌లో ఎన్డీఏకి 18-20, యూపీఏకి 2-4 సీట్లు వస్తాయని న్యూస్‌ 18 సర్వే‌ తెలిపింది.

ఛత్తీస్‌గఢ్‌లో..

 ఇండియా టుడే ఆక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం... ఛత్తీస్‌గఢ్‌లో భాజపా 7-8 సీట్లు గెలుచుకుంటుంది. కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 3-4 సీట్లు దక్కుతాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 11 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. 

 ఛత్తీస్‌గఢ్‌లో ఎన్డీఏకి 7-9 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కి 2-4 సీట్లు వస్తాయని న్యూస్‌ 18 సర్వే తెలిపింది.

రాజస్థాన్‌లో..

ఇండియా టుడే ఆక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం... రాజస్థాన్‌లో భాజపా 23-25 సీట్లు గెలుచుకుంటుంది. కాంగ్రెస్‌ పార్టీకి 0-2 సీట్లు రావొచ్చు. ఈ రాష్ట్రంలో మొత్తం 25 సీట్లు ఉన్నాయి.

రాజస్థాన్‌లో భాజపాకి 22-23, కాంగ్రెస్‌కి 2-3 సీట్లు వచ్చే అవకాశం ఉందని న్యూస్‌ 18 తెలిపింది.   


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.