Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102316
            [news_title_telugu_html] => 

మండ్యలో ‘సుమలతం’
 

[news_title_telugu] => మండ్యలో ‘సుమలతం’   [news_title_english] => Sumalatha won in mandya [news_short_description] => సినీతారలు రాజకీయాల్లోకి రావడం, శాసనసభ, పార్లమెంటుకు వెళ్లడం సాధారణంగా జరిగే విషయమే. ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు కూడా వీరికి టికెట్లు ఇస్తుంటాయి. తాజాగా జరిగిన [news_tags_keywords] => Mandya,Karnataka,sumalatha,Prakash raj,NIkhil Kumaraswamy [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-23 16:29:24 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మండ్యలో ‘సుమలతం’   - Sumalatha won in mandya - EENADU
close

తాజా వార్తలు

మండ్యలో ‘సుమలతం’  

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీతారలు రాజకీయాల్లోకి రావడం, శాసనసభ, పార్లమెంటుకు వెళ్లడం సాధారణంగా జరిగే విషయమే. ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు కూడా వీరికి టికెట్లు ఇస్తుంటాయి. తాజాగా జరిగిన  లోక్‌సభ ఎన్నికల్లోనూ కర్ణాటక నుంచి ఇద్దరు సినీ ప్రముఖులు పోటీ చేశారు. అయితే వీరిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగడం విశేషం. వారే అలనాటి నటి సుమలత, ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌. అయితే వీరిలో ఒకరిని మాత్రమే విజయం వరించింది. మండ్య నుంచి పోటీ చేసిన సుమలత సెంటిమెంట్‌తో గెలవగా.. ప్రకాశ్‌రాజ్‌ కనీసం ప్రత్యర్థులకు పోటీ కూడా ఇవ్వలేకపోయారు. 

భర్త స్థానంలో భార్య విజయం..

దివంగత నటుడు, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ అంబరీశ్‌ సతీమణి, నటి సుమలత రాజకీయ ప్రవేశం ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మండ్య నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన అంబరీశ్‌ గతేడాది కన్నుమూశారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన భార్య సుమలత సిద్ధమయ్యారు. అయితే ఇందుకు కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించగా.. పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీటును జేడీఎస్‌కు కేటాయించడంతో సుమలతకు టికెట్‌ ఇవ్వలేదు. దీంతో అసహనానికి గురైన సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 

అటు జేడీఎస్‌ ఈ స్థానం నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్‌ కుమారస్వామిని బరిలోకి దింపింది. సీఎం కుమారస్వామి కుమారుడైన నిఖిల్‌ తాజా ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. దీంతో తమకు ఎంతో పట్టున్న మండ్య నుంచి నిఖిల్‌ను పోటీలో నిలబెట్టింది జేడీఎస్‌. మరో విషయమేంటంటే నిఖిల్‌ కూడా సినీనటుడే. మరోవైపు సుమలతకు మద్దతిచ్చేందుకు భాజపా ఇక్కడ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. దీంతో మండ్య పోరు ఆసక్తికరంగా మారింది. 

అయితే ఈ ప్రతిష్ఠాత్మక పోరులో నిఖిల్‌పై సుమలత విజయం సాధించారు. మండ్య ఎన్నికల్లో ఒక్కళిగల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సుమలత ఒక్కళిగ 
సామాజికవర్గానికి చెందినవారు కాకపోయినా అంబరీశ్‌ అదే కులానికి చెందినవారు. ఇది ఆమెకు కలిసొచ్చింది. దీంతో పాటు కన్నడ సినీప్రముఖుల మద్దతు కూడా సుమలతకే ఉండటంతో హోరాహోరీ పోరులో ఆమె గెలుపొంది తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. అంతేగాక.. 52ఏళ్ల తర్వాత మండ్య నుంచి లోక్‌సభకు వెళ్తున్న తొలి మహిళా స్వతంత్ర ఎంపీగా గుర్తింపు సాధించారు. 

పనిచేయని ‘ప్రకాశ్‌’ మంత్రం

కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మరో సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌. ముందు నుంచీ తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని చెబుతూ వచ్చిన ప్రకాశ్‌ రాజ్‌.. ఈ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక్కడి నుంచి భాజపా తరఫున సిట్టింగ్‌ ఎంపీ పీసీ మోహన్‌, కాంగ్రెస్‌ తరఫున రిజ్వాన్‌ ఆర్షద్‌ పోటీ చేశారు. సరిహద్దు పునర్విభజనల్లో భాగంగా 2008లో ఈ నియోజకవర్గం ఏర్పడగా.. అప్పటి నుంచి ఇక్కడ భాజపానే గెలుస్తోంది. 

తాజా ఎన్నికల్లోనూ మళ్లీ ఓటర్లు భాజపాకే మొగ్గుచూపారు. సినీ రంగం నుంచి వచ్చిన ప్రకాశ్‌రాజ్‌ కనీస ప్రభావం కూడా చూపించలేకపోయారు. గత ఎన్నికల్లో ఇక్కడ మూడో స్థానంలో నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఈ సారి అభ్యర్థిని నిలబెట్టకుండా ప్రకాశ్‌రాజ్‌కు మద్దతిచ్చింది. అయినప్పటికీ ఆయన నెగ్గలేకపోయారు. తాజా ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ మూడో స్థానానికి పరిమితమయ్యారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.