close

తాజా వార్తలు

ఆరు చోట్ల అర లక్షకు పైగా ఆధిక్యం.. 

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా అఖండ విజయం సాధించింది. నాలుగు జిల్లాల్లో తెదేపాకు ప్రాతినిధ్యం కూడా లేకుండా జగన్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. చాలా నియోజకవర్గాల్లో ప్రధాన ప్రత్యర్థుల మధ్య గెలుపు నువ్వా-నేనా అన్నట్లు దోబూచులాడగా.. ఆరు చోట్ల వైకాపా అభ్యర్థులు అర లక్షకు పైగా ఆధిక్యంతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. 

ఈ ఎన్నికల్లో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ అత్యధిక ఆధిక్యాన్ని నమోదు చేశారు. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగిన జగన్‌.. తన సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి సతీశ్‌రెడ్డిపై 90,110 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో గిద్దలూరులో వైకాపా అభ్యర్థి వెంకట రాంబాబు 81,035 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కె. సంజీవయ్య(వైకాపా) 61,292 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైకాపా అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి 55,207 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో అంజాద్‌ బాషా(వైకాపా) 54794 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కడప జిల్లాలో జమ్మలమడుగులో వైకాపా అభ్యర్థి సుధీర్‌ రెడ్డి తన సమీప తెదేపా అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై 51,641 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 

1000లోపు ఆధిక్యంతో గెలిచింది వీరే..
మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థుల ఆధిక్యం కేవలం 1000లోపే ఉండటం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్‌.. వైకాపా అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై 814 ఓట్ల తేడాతో గెలిచారు. కృష్ణా జిల్లా గన్నవరంలో తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ 838 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గుంటూరు జిల్లా వేమూరులో వైకాపా అభ్యర్థి మేరుగు నాగార్జున.. తన సమీప తెదేపా అభ్యర్థి నక్కా ఆనంద్‌ బాబుపై 999 ఓట్ల తేడాతో గెలుపొందారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో వైకాపా అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డి కేవలం 708 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.