Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102909
            [news_title_telugu_html] => 

స్థానికసంస్థల ఓట్ల లెక్కింపు వాయిదా

[news_title_telugu] => స్థానికసంస్థల ఓట్ల లెక్కింపు వాయిదా [news_title_english] => TS localbody election vote counting date postponed [news_short_description] => తెలంగాణలో ఈ నెల 27న జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది.  రాష్ట్రంలో ఇటీవల మూడు దశల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తూ... [news_tags_keywords] => SEC,Localbody elections,ts news [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/nPf4_s7VtNk [news_videoinfo] => |https://www.youtube.com/embed/nPf4_s7VtNk [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-25 00:10:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
స్థానికసంస్థల ఓట్ల లెక్కింపు వాయిదా - TS localbody election vote counting date postponed - EENADU
close

తాజా వార్తలు

స్థానికసంస్థల ఓట్ల లెక్కింపు వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణలో ఈ నెల 27న జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది.  రాష్ట్రంలో ఇటీవల మూడు దశల్లో జరిగిన  స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా ఎన్నికయ్యే మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌ల పదవీకాలం జులై నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఉమ్మడి ఖమ్మంలో జులై 4నుంచి, మిగతా చోట్ల జులై 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తయితే మొదటి సమావేశం జరగాలంటే వారు మరో నెలపాటు అలా ఆగాల్సి ఉంటుంది. నెలపాటు ఆగితే ఛైర్‌పర్సన్ల ప్రత్యక్ష ఎన్నికకు సంబంధించి ఇబ్బందులు వస్తాయని.. క్యాంపులు నిర్వహించాల్సి వస్తుందని, ఫిరాయింపులు జరిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఇలాంటి పరిస్థితులు తలెత్తితే ఇబ్బందికరంగా ఉంటుందని.. ఫిరాయింపులను ప్రోత్సహించినట్టవుతుందని ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేశాయి. వీటన్నింటినీ పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), పంచాయతీ రాజ్‌ శాఖ అభిప్రాయం తీసుకుంది. ఇప్పటికే లెక్కింపు తేదీ ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ షెడ్యూల్‌ ఇవ్వాలంటే కొంత సవరణ చేయాల్సి ఉంటుంది గనక పంచాయతీరాజ్‌ శాఖ అనుమతి తీసుకొని ఓట్ల లెక్కింపు తేదీని వాయిదా వేసింది. తదుపరి ఓట్ల లెక్కింపు తేదీపై నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు ఎస్‌ఈసీ స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తరఫున కార్యదర్శి అశోక్‌కుమార్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. 

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రతపై ఎస్‌ఈసీ ఆదేశాలు
పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్ట్రాంగ్‌రూమ్‌లు, బ్యాలెట్‌ బాక్స్‌ల స్టోరేజీ, భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది. అలాగే, లెక్కింపు పూర్తయ్యే వరకు స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత కొనసాగించాలని రాష్ట్ర డీజీపీని కోరింది. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఈసీ ఆదేశించింది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.