close

తాజా వార్తలు

రేపు  కేసీఆర్‌ను కలవనున్న జగన్‌

అమరావతి: వైకాపా అధినేత, ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రేపు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని కేసీఆర్‌ నివాసానికి చేరుకొని భేటీ కానున్నారు. ఈ నెల 30న విజయవాడలో జరిగే తన ప్రమాణస్వీకారోత్సవానికి ఆయనను ఆహ్వానించనున్నారు.
ఏపీలో నిన్న వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో వైకాపా చారిత్రక విజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాల్లో వైకాపా విజయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో తెరాస అధినేత కేసీఆర్‌ నిన్న జగన్మోహన్‌రెడ్డికి ఫోన్‌చేసి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.