Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 103016
      [news_title_telugu_html] => 

స్థలాలే కాదు ఇళ్లనూ కొంటున్నారు 

[news_title_telugu] => స్థలాలే కాదు ఇళ్లనూ కొంటున్నారు  [news_title_english] => real estate lands hyderabad [news_short_description] => సొంతిల్లు ఉంటే మరో ఇల్లు కొనుగోలుపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు నగరవాసులు. ఇది పాత మాట. హైదరాబాద్‌ మార్కెట్‌లో ఈ పోకడలో క్రమంగా మార్పులు వస్తున్నాయి. పెట్టుబడి దృష్ట్యా భూములనే కాదు ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఇటీవల ముందుకొస్తున్నారు. అద్దెల రూపంలో ఆదాయం వస్తుందని.. [news_tags_keywords] => real estate, lands, hyderabad [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-25 02:42:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
స్థలాలే కాదు ఇళ్లనూ కొంటున్నారు  - real estate lands hyderabad - EENADU
close

తాజా వార్తలు

స్థలాలే కాదు ఇళ్లనూ కొంటున్నారు 

ఈనాడు, హైదరాబాద్‌

సొంతిల్లు ఉంటే మరో ఇల్లు కొనుగోలుపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు నగరవాసులు. ఇది పాత మాట. హైదరాబాద్‌ మార్కెట్‌లో ఈ పోకడలో క్రమంగా మార్పులు వస్తున్నాయి. పెట్టుబడి దృష్ట్యా భూములనే కాదు ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఇటీవల ముందుకొస్తున్నారు. అద్దెల రూపంలో ఆదాయం వస్తుందని.. భవిష్యత్తులో ఇళ్ల ధరలు మరింత పెరిగితే కొనలేమనే ముందుచూపుతో వ్వవహరిస్తున్నారు. నగరం విస్తరిస్తుండటంతో స్థలాలతో పాటూ ఇళ్లను పిల్లల కోసం కొంటున్నారు.

దేశంలోని ఇతర మార్కెట్లతో పోలిస్తే హైదరాబాద్‌ భిన్నమని స్థిరాస్తి నిపుణులు చెబుతుంటారు. ఇక్కడ 95 శాతంపైగా ఇళ్లను ఉండేందుకు కొనుగోలు చేస్తుంటారు. ఇతర నగరాల్లో చాలామంది ఏదైనా ప్రాజెక్ట్‌ మొదలు కాగానే అందులో ఫ్లాట్‌ బుక్‌  చేయడం, పూర్తయ్యేనాటికి మంచి ధర వస్తే విక్రయించేవారు. మన దగ్గర ఈ తరహా లావాదేవీలు చాలా స్వల్పమని నిర్మాణదారులు చెబుతుంటారు. ఇదివరకే రెండు పడకగదుల ఫ్లాట్‌ ఉంటే కొత్తగా మూడు పడకగదుల ఫ్లాట్‌,  నగరంలో ఫ్లాట్‌ ఉంటే శివార్లలో విల్లా, వ్యక్తిగత ఇళ్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.

స్థిరమైన వృద్ధి.. 
ప్రధాన నగరాల్లో స్థిరాస్తి మార్కెట్‌ ఒడుదొడుకులు తీవ్రంగా ఉన్నా.. ఇక్కడ స్థిరంగా వృద్ధి పథంలోనే కొనసాగడం మన మార్కెట్‌ ప్రత్యేకత. నిర్మాణదారులు సైతం కొత్త ప్రాజెక్ట్‌ ప్రారంభించే ముందు డిమాండ్‌ను అధ్యయనం చేశాకే ప్రకటిస్తున్నారు. దీంతో అమ్మకం కాకుండా మిగిలిపోయే ఇళ్లు చాలా స్వల్పంగా ఉంటున్నాయి. డిమాండ్‌తో పోలిస్తే సరఫరానే తక్కువగా ఉంటుంది. ఫలితంగా చదరపు అడుగు ధర ఏ ప్రాంతంలో తీసుకున్నా పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు తక్కువ. ఏడాది క్రితం రాజేంద్రనగర్‌ పరిధిలోని బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో గరిష్ఠంగా చదరపు అడుగు రూ.3500 ఉండగా.. ఇప్పుడు రూ.4వేలపైన చెబుతున్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చినవారు.. ఆర్థికంగా వెసులుబాటును చూసుకుని మరో ఇల్లును కొనుగోలు చేస్తున్నారు.

రుణాల లభ్యతతో.. 
స్థలాలతో పోలిస్తే ఇంటికి రుణాల లభ్యత సులభం. పైగా తక్కువ వడ్డీ కూడా. భార్యాభర్తల్లో ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఇద్దరి పేరున చెరో ఇల్లు కొనేస్తున్నారు. కొత్త ఇంట్లోకి మారిపోయి పాత ఇంటిని అద్దెకిస్తున్నారు. అప్పటికే స్థిరపడిన ప్రాంతమైతే కొత్త ఇంటినే కిరాయికి ఇస్తున్నారు. ఇక్కడ వచ్చే అద్దెతో ఈఎంఐ చెల్లిస్తున్నారు.  స్థలాలు, భూములు విక్రయించగా వచ్చిన సొమ్ముతో కొంతమంది, పదవీ విరమణతో వచ్చిన ప్రయోజనాలతో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. నెలనెలా ఆదాయం కోసం వీరు ఇళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. తమ కళ్లముందే ఆస్తి ఉంటుంది.. ఆదాయం వస్తుందనేది వీరి ఆలోచన.

ఎక్కడ డిమాండ్‌.. 
అద్దెల పరంగా చూస్తే పని ప్రదేశానికి దగ్గర ఉన్న ఇళ్లకు డిమాండ్‌ అధికం. అరగంటలోపు చేరుకునేంత చేరువలో ఉండాలని నగరవాసులు ప్రధానంగా చూస్తున్నారు. సరైన ప్రజారవాణా లేకపోవడం, గంటల తరబడి ట్రాఫిక్‌లో ప్రయాణంతో విలువైన సమయం వృథా.. శారీరక శ్రమకు గురి చేస్తుండటంతో కార్యాలయం సమీపంలో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. 
ఉపాధి అవకాశాలు ఉన్న చోటనే గృహ నిర్మాణాల ప్రాజెక్ట్‌లు ఎక్కువగా చేపడుతున్నారు. ఐటీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు నగరంలోకెల్లా అధికంగా ఉన్నాయి. దీంతో కూకట్‌పల్లి, మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, నల్లగండ్ల చుట్టు పక్కల ప్రాంతాల్లో కొనుగోలుకు  ఆసక్తి చూపుతున్నారు. 

తూర్పు హైదరాబాద్‌ పరిధిలోని మల్కాజిగిరి, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో మెట్రో మార్గం అందుబాటులోకి రావడంతో మార్కెట్‌ బాగా పుంజుకుంది. బడా సంస్థలు ఇక్కడ గేటెడ్‌ కమ్యూనిటీలను నిర్మిస్తున్నాయి. ఇటీవల అద్దెలు పెరిగాయి. 
తూర్పు తర్వాత స్థిరాస్తికి ఆశాజనకంగా ఉత్తర హైదరాబాద్‌ మార్కెట్‌ కనిపిస్తోంది. కొంపల్లి, మేడ్చల్‌, అల్వాల్‌, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. ఫార్మా పరిశ్రమలు, పరిశోధన సంస్థలతో ఉపాధి అవకాశం ఉండటంతో మార్కెట్‌పై సానుకూలత ఏర్పడింది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి కనెక్టివిటీ ఉండటం కలిసి వస్తోంది. ఇక్కడి నుంచి ఐటీ కేంద్రానికి వచ్చిపోయే ఉన్నారు. విల్లాల వంటివాటికి డిమాండ్‌ ఉంది. 
హైదరాబాద్‌ దక్షిణంలో రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ ప్రాంతాలు వస్తాయి. విమానాశ్రయ మార్గం కావడం, మెట్రో విస్తరణ, ప్రముఖ విద్యాసంస్థలు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. రవాణా సదుపాయం పెరిగింది. దీంతో ఇక్కడ అద్దెలు బాగానే ఉన్నాయి.

ఎంపిక ఇలా... 
రెండో ఇల్లు, మూడో ఇల్లు కొంటున్నా.. మార్కెట్లో వేర్వేరు ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్నవి, గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి.. ఈ రెండే కాకుండా పాత ఇళ్లు అమ్మకానికి వస్తుంటాయి. మంచి ధరకే వస్తుంది అనుకుంటే వీటిలో దేనినైనా తీసుకోవచ్చు. ప్రాంతాన్ని బట్టి, ఆర్థిక వెలుసుబాటును బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
 

సిద్ధంగా ఉన్న వాటిలో.. 
మూడు నుంచి ఐదేళ్ల పాటూ కొత్త ఇంటికోసం ఎదురుచూడాల్సిన పని లేదు. కొన్న వెంటనే గృహప్రవేశం చేయవచ్చు. 
సిద్ధంగా ఉన్న ఇళ్లు ఆయా ప్రాజెక్ట్‌లలో పరిమితంగా ఉంటాయి. కాబట్టి సహజంగానే ధర కాస్త ఎక్కువే ఉంటుంది. నిర్మాణదారు ఆర్థిక అవసరాలను బట్టి.. కొన్నిసార్లు తక్కువ ధరకు కూడా వస్తుంది. 
వీటిలో కొనుగోలుకు ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వాయిదాల అవకాశం ఉన్నా స్వల్పకాలం మాత్రమే.

నిర్మాణంలో ఉండగా... 
సొమ్ము చేతికి దశలవారీగా అందుతుంది అనుకుంటే నిర్మాణంలో ఉన్న వాటిని కొనుగోలు చేయడమే అత్యుత్తమం. 
ప్రాజెక్ట్‌ ప్రారంభంలో కాబట్టి నచ్చిన ఫ్లోర్‌, దిక్కుతో పాటూ ధర కూడా తక్కువకే వస్తుంది. 
కొన్ని సంస్థలైతే వారి పూర్వ కొనుగోలుదారులకు ఇటువంటి సమాచారాన్ని ముందస్తుగా చేరవేస్తున్నాయి. తద్వారా బుకింగ్స్‌ చేపడుతున్నాయి. రాయితీలు అందిస్తాయి. 
ఇంటిని తమకు కావాల్సిన రీతిలో కట్టించుకోవచ్చు. నిర్మాణ సమయంలోనే ఇటువంటి వెసులుబాటు ఉంటుంది. 
ఇల్లు పూర్తయ్యేసరికి నగరంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠంగా 30 శాతం వరకు ధరల్లో పెరుగుదల ఉంటుంది. ఆ మేరకు కొనుగోలు చేస్తే మొత్తం వ్యయం తగ్గినట్లే. 
నిర్మాణదారుడు ఎంతకాలం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయగలడనేది కొనేముందు చూడాలి. చెప్పిన సమయానికి ఇచ్చే చరిత్ర ఉందా లేదా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

పాతవాటిలో.. 
నగరంలో ఇప్పుడే కాదు పాత ఇళ్ల అమ్మకాలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కువగా అమ్మకానికి వస్తుంటాయంతే. గృహరుణాలు చెల్లించలేకపోవడం, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం, పెద్ద ఇంటికి మారడం, నగరాన్ని వదిలేసి వెళుతుండటం, విదేశాల వంటి కారణాలతో పాత ఇళ్లు విక్రయానికి వస్తుంటాయి. రంగులు వేస్తే కొత్త ఇంటి లుక్‌ సంతరించుకుంటుంది. 
పాత ఇళ్లని చాలామంది చిన్నచూపు చూస్తుంటారు. కానీ నిర్మాణం బాగున్న అపార్ట్‌మెంట్లలో ఈ తరహా ఇళ్లను కొనుగోలు చేయవచ్చు. 
సహజంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఎక్కువగా పాత ఇళ్లు అమ్మకానికి వస్తుంటాయి. అటువంటి చోట కొత్త ఇల్లు కొనుగోలు అందరికీ సాధ్యపడకపోవచ్చు. చ.అడుగు ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అదే పాత ఇల్లు అయితే బడ్జెట్‌లో వస్తుంది. 
ఎన్నేళ్ల కిందట భవనాన్ని నిర్మించారనేదాన్ని బట్టి ధర ఆధారపడి ఉంటుంది. స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌తో ఒకసారి పరిశీలించుకుంటే మంచిది. 
చూడటానికి కొన్ని ఇళ్లు పురాతనంగా కన్పిస్తాయి. సరైన నిర్వహణ లేక అలా కన్పిస్తుంటాయి. కట్టడం నాణ్యంగా ఉంటే వీటిని మరో ఆలోచన లేకుండా కొనుగోలు చేయవచ్చు. రంగులేస్తే కొత్తదానికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. ఈ ఖర్చుంతా లెక్కలేసుకుని బేరమాడవచ్చు. 
తమ అవసరాలను బట్టి ఒకటి, రెండు, మూడు పడక గదుల ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయవచ్చు. 
న్యాయపరమైన చిక్కులు లేకుండా.. పార్కింగ్‌ సదుపాయం అన్నీ పక్కాగా ఉంటే ఎంచక్కా ఇంటివారైపోవచ్చు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.