Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 103266
            [news_title_telugu_html] => 

జగన్‌ ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారు

[news_title_telugu] => జగన్‌ ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారు [news_title_english] => Jagan sworn as a CM on 30th May in VIjayawada [news_short_description] => ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి అధికారులు వేదికను ఖరారు చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో [news_tags_keywords] => jagan, YSRCP, vijayawada [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-25 14:51:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జగన్‌ ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారు - Jagan sworn as a CM on 30th May in VIjayawada - EENADU
close

తాజా వార్తలు

జగన్‌ ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారు

విజయవాడ: ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి అధికారులు వేదికను ఖరారు చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఈ స్టేడియంలో 35వేల మంది గ్యాలరీల్లో కూర్చొనే అవకాశం ఉండడం, దిగువన మరో 20వేల మంది కూర్చొనే వెసులుబాటు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తంగా 50వేల మందికి పైగా కూర్చొనే వెసులుబాటు ఉండటంతో ఈ మేరకు అక్కడే ప్రమాణస్వీకారోత్సవం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. 

తొలుత చినఅవుటపల్లి జాతీయ రహదారికి ఆనుకొని వున్న ఓ ప్రాంతంలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులు భావించినప్పటికీ.. వైఎస్‌ జగన్‌ మాత్రం విజయవాడలోనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మున్సిపల్‌ మైదానంలోకి వచ్చిన రహదారులు, ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ అధికారుల్ని ఆదేశించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఇతర వీవీఐపీలంతా హాజరయ్యే అవకాశం ఉండటంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.