close

తాజా వార్తలు

ప్రభుత్వ ఏర్పాటుకు జగన్‌కు గవర్నర్‌ ఆహ్వానం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపాను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ నరసింహన్‌ ఆహ్వానించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకార ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12:23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇవాళ ఉదయం వైకాపా ఎమ్మెల్యేలంతా సమావేశమై తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రతిని ఆ పార్టీ ముఖ్యనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని వైకాపా నేతల బృందం గవర్నర్‌కు అందించింది. అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను జగన్ కలిశారు. వైకాపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనందుకు జగన్మోహన్ రెడ్డిని గవర్నర్‌ అభినందించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన్ను ఆహ్వానించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.