close

తాజా వార్తలు

ధర్నాకు దిగనున్న మమతా బెనర్జీ?

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ధర్నాకు దిగనున్నట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింసపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘర్షణల్లో తమ పార్టీకి చెందిన కార్యకర్తలు నిరాశ్రయులయ్యారని ఆరోపిస్తూ మమత ధర్నాకు దిగుతున్నారు. కోల్‌కతాలోని నైహాతిలోని మున్సిపాలిటి కార్యాలయం ముందు వైపు ఉన్న స్థలంలో ఆమె ఈ నిరసన చేపట్టనున్నారు. ఘర్షణలు అధికంగా చోటు చేసుకున్న ప్రాంతాల్లో నైహాతి కూడా ఒకటి. భాజపా కార్యకర్తలు పలు చోట్ల దుకాణాలను ధ్వంసం చేశారని, కొన్ని చోట్ల వాహనాలను తగులబెట్టారని ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత టీఎంసీ ఆరోపించింది. తమ పార్టీ కార్యాలయాలను కూడా ధ్వంసం చేశారని చెప్పుకొచ్చింది. 

మరోవైపు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తానని మొదట చెప్పిన దీదీ.. ఆ తర్వాత బెంగాల్‌లో రాజకీయ ఘర్షణలు జరిగి 54 మంది హత్యకుగురయ్యారని భాజపా చెబుతున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లబోనని చెప్పారు. మోదీ ప్రమాణస్వీకారం గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన భాజపా కార్యకర్తల కుటుంబ సభ్యులను భాజపా ఆహ్వానించింది. దీంతో మమతా బెనర్జీ ఘర్షణల్లో తమవారికే నష్టం జరిగిందంటూ ధర్నాకు దిగుతున్నారు. ఆమె ఒక్కరోజు మాత్రమే ధర్నా చేస్తారా? అన్న విషయంపై స్పష్టం రాలేదు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.