close

తాజా వార్తలు

జిమ్‌లో ఎక్కువగా గడిపే భారత క్రికెటర్‌?

రవీంద్ర జడేజా సమాధానం ఎవరో తెలుసా?

లండన్‌: మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌ కోసం అన్ని జట్లు సన్నద్ధమయ్యాయి. ఆటగాళ్లతో పాటు అభిమానులు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌ సమరం రానేవచ్చింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగేందుకు కొన్ని సరదా ఆటలు ఆడుతుండగా మరికొందరు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కొన్ని సరదా ప్రశ్నలకి సమాధానమిచ్చాడు. 

టీమిండియాలో ఏ ఆటగాడు జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతాడు? ఎవరెక్కువ సెల్ఫీలు ఇష్టపడతారు?ఆటగాళ్లలో బస్సుకి ఎవరు లేటుగా వస్తారు?, ఎవరు చెత్తగా డ్యాన్స్‌ చేస్తారు?లాంటి సరదా ప్రశ్నలకి జడేజా కొంత పేర్లను వెల్లడించాడు. అవేంటో అతడి మాటల్లోనే చూద్దాం. 
సెల్ఫీలెవరెక్కువ ఇష్టపడతారు?              - శిఖర్‌ధావన్‌
చెత్త డ్యాన్సర్‌?                             - ఎంఎస్‌.ధోనీ 
మైక్‌లో ఎంటర్‌టైన్‌ ఎవరు చేస్తారు?          - విరాట్‌కోహ్లీ
విమాన సమాచారం అడిగేవారు?             - మహ్మద్‌ షమీ
రొమాంటిక్‌ కామెడీస్‌ ఇష్టపడేదెవరు?         - బుమ్రా 
 తమ గురించి తామే గూగుల్‌ చేసే వ్యక్తి?    - యుజువేంద్ర చాహల్‌
కాఫీ ఎక్కువ ఇష్టపడేదెవరు?                - రోహిత్‌శర్మ
బస్‌కి లేటొచ్చేవారు?                       - రోహిత్‌శర్మ
ఎప్పుడూ జిమ్‌లో ఉండేదెవరు?             - విరాట్‌కోహ్లీ
ఎప్పుడూ ఫోన్‌లో మునిగేదెవరు?           -  శిఖర్‌ ధావన్‌

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.