close

తాజా వార్తలు

పాక్‌ నిజస్వరూపం బయటపడింది: శివసేన

ముంబయి (మహారాష్ట్ర): పాకిస్థాన్‌లోని భారత హై కమిషనర్‌ అజయ్‌ బిసారియా.. ఇస్లామాబాద్‌లోని ఓ హోటల్‌లో ఇటీవల ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసి, భారత అధికారులు, దౌత్యవేత్తలను అతిథులుగా ఆహ్వానించగా కొందరితో అక్కడి భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. భారత అధికారులకు మరోసారి అవమానం జరగడం పట్ల స్పందించిన శివసేన తమ పత్రిక సామ్నాలో ఓ కథనం రాసుకొచ్చింది. పాక్‌ చర్యలు ఖండిస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో పాక్‌ చర్చల కోసం జరుపుతున్న ప్రయత్నాలు ఇవేనా? అంటూ ఎద్దేవా చేసింది. 

‘‘శాంతి కోసం చర్చలు జరిపేందుకు పాక్‌ జరుపుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ వేధింపులు చోటు చేసుకున్నాయని భావించాలా? పాక్‌ నిజస్వరూపం మరోసారి రుజువైంది. ఏ విషయంపై అయినా సరే చర్చలు జరపడానికి కావాల్సిన విలువ పాక్‌కు లేదు. భారత హై కమిషనరు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్‌కి పాక్‌లోని ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించారు. అయితే, మసూద్‌ అజార్‌ లాంటి వారిని ఈ విందుకు ఆహ్వానించకపోవడమే పాక్‌ను ఆగ్రహానికి గురిచేసినట్లుంది. పాక్‌ ఒక దేశంగా కాకుండా ఉగ్రవాదులను తయారు చేసి ప్రపంచానికి అందించే ఓ కర్మాగారంగా మారింది. పాక్‌పై ఐఎస్‌ఐ, ఆర్మీ ఆధిపత్యాన్ని చెలయిస్తున్నాయి. ప్రజాస్వామ్య మార్గంలోనే ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ను ఎన్నుకున్నారన్నది భ్రమే’’ అని శివసేన విమర్శలు గుప్పించింది.     


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.