Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 107711
            [news_title_telugu_html] => 

‘పరిషత్‌’ ఎన్నికల్లో తెరాస అఖండ విజయం!

[news_title_telugu] => ‘పరిషత్‌’ ఎన్నికల్లో తెరాస అఖండ విజయం! [news_title_english] => TRS landslide victory in Localbody Elections [news_short_description] => స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెరాస ప్రభంజనం కొనసాగింది. హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగ్గా.. అన్ని జిల్లాల్లోనూ ‘కారు’ [news_tags_keywords] => trs,localbody elections,MPTC, ZPTC,ts politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/EQ_YyCetK0c [news_videoinfo] => |https://www.youtube.com/embed/EQ_YyCetK0c [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-04 19:54:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘పరిషత్‌’ ఎన్నికల్లో తెరాస అఖండ విజయం! - TRS landslide victory in Localbody Elections - EENADU
close

తాజా వార్తలు

‘పరిషత్‌’ ఎన్నికల్లో తెరాస అఖండ విజయం!

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెరాస ప్రభంజనం కొనసాగింది. హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగ్గా.. అన్ని జిల్లాల్లోనూ ‘కారు’ దూసుకెళ్లింది. ఎంపీటీసీ ఫలితాల్లో అధిక శాతం స్థానాలు గులాబీ ఖాతాలోనే చేరాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన తెరాస.. పరిషత్‌ సమరంలోనూ అదే దూకుడును ప్రదర్శించి తిరుగులేని విజయం సొంతంచేసుకుంది. ఈ ఎన్నికల్లో తెరాస అగ్రపథంలో దూసుకుపోగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. భాజపా చెప్పుకోదగిన ఫలితాలు సాధించగా.. తెదేపా, వామపక్షాలు నామమాత్రానికే పరిమితమయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలకు స్వతంత్ర అభ్యర్థులు గట్టిగానే పోటీ ఇచ్చారు. జడ్పీటీసీ ఫలితాలల్లోనూ తెరాస హవా కొనసాగింది. అత్యధిక స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది. తిరుగులేని విజయం సాధించడంతో గులాబీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. నేతలు గులాబీ రంగులు పులుముకుంటూ సంబురాలు చేసుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో అధిక సంఖ్యలో అభ్యర్థులు గెలవడంతో ఎమ్మెల్యే హరీశ్‌ కార్యకర్తలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.  

నాలుగు జిల్లాల్లో తెరాస స్వీప్‌!
ఇప్పటివరకు విడుదలైన నాలుగు జిల్లాలను గులాబీ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. కాంగ్రెస్‌ రెండో స్థానానికి పరిమితమైంది. రాష్ట్రంలోని అన్ని జడ్పీ స్థానాలనూ కైవసం చేసుకొనే దిశగా తెరాస కొనసాగుతోంది. మొత్తం 534 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 372 స్థానాల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్‌ 53 స్థానాల్లో సత్తా చాటింది. భాజపా 6 స్థానాల్లో గెలుపొందగా.. వామపక్షాలు ఒకచోట, ఇతరులు నాలుగు చోట్ల పాగా వేశారు. మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, వరంగల్‌ గ్రామీణ, వరంగల్‌ పట్టణ జిల్లాల్లో అధికార పార్టీ జడ్పీ ఫలితాల్లో ఏకపక్షంగా విజయం సాధించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోనూ తెరాస ఆధిపత్యం కనబర్చింది. అత్యధిక స్థానాలు దక్కించుకొని తెరాస అభ్యర్థులు సత్తాచాటారు. 

పాలమూరు జిల్లాలో మొత్తం 13 జడ్పీటీసీ స్థానాలు ఉండగా అన్నిచోట్లా అధికార పార్టీయే గెలుపొందింది. వనపర్తి జిల్లాలో 14 స్థానాల్లో 13 తెరాస, కాంగ్రెస్‌ ఒక స్థానంలో విజయం సాధించాయి. నారాయణపేట్‌ జిల్లాలో 11 స్థానాలకు గాను 9 తెరాస, కాంగ్రెస్‌, భాజపా చెరో స్థానంలో విజయం సాధించింది. నాగర్‌కర్నూలులో 20 స్థానాలు ఉండగా తెరాస 17 ,కాంగ్రెస్‌ 3 చోట్ల సత్తా చాటాయి. నిజామాబాద్‌ జిల్లాలో 27 స్థానాల్లో 23 తెరాస, చెరో రెండు స్థానాలో భాజపా, కాంగ్రెస్‌ నిలిచాయి. కామారెడ్డిలో 22 స్థానాల్లో  14 తెరాస, కాంగ్రెస్‌ 8 చోట్ల విజయకేతనం ఎగురవేశాయి. మెదక్‌ జిల్లాల్లో మొత్తం 20 స్థానాలు ఉండగా.. తెరాస చేతికి 18, కాంగ్రెస్‌ 2 చోట్ల గెలిచింది. సిద్దిపేట జిల్లాలో 23 స్థానాలు ఉండగా.. తెరాస 22, కాంగ్రెస్‌ ఒకచోట గెలుపొందాయి. మేడ్చల్‌ జిల్లాలో 5 స్థానాలకు గాను తెరాస 4, కాంగ్రెస్‌ ఒకచోట గెలిచింది.  నిర్మల్‌ జిల్లాలో 18 స్థానాలకు గాను తెరాస 12, కాంగ్రెస్‌ 5, ఇతరులు ఒకచోట గెలుపొందారు. కుమ్రంభీంలో మొత్తం 15 స్థానాలకు గాను తెరాస 14, కాంగ్రెస్‌ ఒక స్థానంలో సత్తా చాటింది. మంచిర్యాలలో 16  స్థానాలు ఉండగా.. తెరాస 13, కాంగ్రెస్‌ 2 ఇతరులు 1 కైవసం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో 20 స్థానాలు ఉండగా.. అధికార పార్టీ 15, కాంగ్రెస్‌ 3, వామపక్షాలు, ఇతరులు చెరోచోట విజయం దక్కించుకున్నాయి. పెద్దపల్లిలో 13 స్థానాలకుగాను తెరాస 11, కాంగ్రెస్‌ 2 స్థానాల్లో విజయం సాధించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 స్థానాలకు గాను తెరాస 11, ఇతరులు ఒక చోట జయకేతనం ఎగురవేశారు.

ఎంపీటీసీ ఫలితాల్లోనూ అదే జోరు..
ఎంపీటీసీ ఫలితాల్లోనూ అధికార పార్టీ ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 5816 ఎంపీటీసీ స్థానాలకు గాను 5815 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. బ్యాలెట్‌ బాక్స్‌కు చెదలు పట్టడంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అంబట్‌పల్లి-సూరారం ఎంపీటీసీ స్థానానికి లెక్కింపు నిలిపివేశారు. తెరాస 3556 స్థానాల్లో గెలుపొంది సత్తా చాటగా.. కాంగ్రెస్‌ 1377 స్థానాల్లో గెలుపొంది రెండో స్థానంలో నిలిచింది. భాజపా 211, తెదేపా 21, వామపక్షాలు 78 స్థానాల్లో గెలుపొందాయి. ఇతరులు 572 స్థానాల్లో విజయదుందుభి మోగించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.