close

తాజా వార్తలు

అక్కినేని కోడలు..సోషల్‌మీడియా క్వీన్‌

అందం, అభినయం, మంచితనం.. ఈ పదాలకు నిర్వచనం సమంత. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చి తన శ్రమతో నేడు అగ్ర కథానాయికగా వెలుగొందుతున్నారు. కథానాయికగా హీరోల పక్కన ఇలా మెరిసి, అలా వెళ్లిపోకుండా ప్రాధాన్యం ఉన్న పాత్రల్ని ఎంచుకుంటూ అందర్నీ మెప్పిస్తున్నారు. అంతేకాదు అనారోగ్యంతో బాధపడుతున్న వందల మంది చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. తన గొప్ప వ్యక్తిత్వంతో అక్కినేని వారసుడు నాగచైతన్య మనసు దోచి ఆ ఇంటి కోడలయ్యారు. అందుకే ఆమంటే అభిమానులకు అంత ఇష్టం. సోషల్‌మీడియాలో సామ్‌కు ఉన్న క్రేజే వేరు. ఆమె సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటుంటారు. అభిమానులతో తన మనసులోని మాటల్ని చెబుతూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఆమె అభిమానులతో పంచుకున్న కొన్ని విశేషాలను చూద్దాం..

ఫాలోవర్స్‌

ఫేస్‌బుక్‌: 80.7 లక్షల మంది
ట్విటర్‌: 70.47 లక్షల మంది
ఇన్‌స్టాగ్రామ్‌: 60.9 లక్షల మంది


సామాజిక సేవ

నారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులు, మహిళలకు వైద్య సేవలు అందించేందుకు సమంత 2012లో ప్రత్యూష ఫౌండేషన్‌ను స్థాపించారు. పలు ఉత్పత్తులకు ప్రచారకర్తగా వచ్చే పారితోషికాన్ని, ప్రారంభోత్సవాల ద్వారా వచ్చే మొత్తాన్ని ఆమె ఈ సంస్థకు విరాళంగా ఇస్తున్నారు. ఇలా ఇప్పటికి ఆమె వందల మందికి చికిత్స చేయించారు. ఫౌండేషన్‌కు చెందిన చిన్నారులతో కలిసి దిగిన ఫొటోలను కూడా ఆమె పలు సందర్భాల్లో అభిమానులతో షేర్‌ చేసుకున్నారు.


ఫిట్‌నెస్‌

సామ్‌ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాముఖ్యం ఇస్తుంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు. పలు సందర్భాల్లో ఫిట్‌నెస్‌ వీడియోలను షేర్‌ చేశారు. ఇటీవల 100 కిలోలు లిఫ్ట్‌ చేసి నెటిజన్లతో శభాష్‌ అనిపించుకున్నారు.


సామ్‌ పేజీలో చైతన్య

నాగ చైతన్య సోషల్‌మీడియాకు కాస్త దూరంగా ఉంటారు. ప్రత్యేక సందర్భాలు, సినిమా విశేషాలను మాత్రమే అరుదుగా షేర్‌ చేస్తుంటారు. అయితే భార్యగా సమంత .. చైతన్య జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగత విషయాలను కూడా షేర్‌ చేస్తూ వస్తున్నారు. నిశ్చితార్థం తర్వాత ఓసారి చై ఫిట్‌నెస్‌ వీడియో షేర్‌ చేస్తూ.. ‘ఎన్నో సార్లు అడుక్కుని, బలవంతం చేసిన తర్వాత ఈ వీడియో షేర్‌ చేసేందుకు ఒప్పుకున్నాడు’ అని సామ్‌ పేర్కొన్నారు.


విమర్శలు

సెలబ్రిటీలకు సలహాలు ఇవ్వడంలో అందరూ ముందుంటారు. ఇలా ఉండాలి, అలా దుస్తులు ధరించాలని.. అందరూ సలహాలు ఇచ్చేవారే. పెళ్లి తర్వాత సామ్‌ బీచ్‌ దగ్గర ఎరుపు రంగు పొట్టి దుస్తుల్లో ఉన్న ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెకు సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. కొందరు తీవ్రంగా విమర్శించారు. అయితే ఇలాంటి విమర్శల్ని పట్టించుకోనంటూ అప్పట్లో సామ్‌ అన్నారు. ఇటీవల కూడా ఆమె షేర్‌ చేసిన ఓ ఫొటోకు కూడా కొందరు నెటిజన్ల నుంచి వ్యతిరేక స్పందన వచ్చింది.


హష్‌ అక్కినేని

ప్పుడు చైతన్య, సమంత ఇంట్లో మరొకరు కూడా ఉంటున్నారు. దానిపేరు హష్‌(డాగ్‌). గత కొన్ని నెలలుగా ఇది సామ్‌తో ఉంటోంది. హష్‌పై ఆమె చాలా ప్రేమ పెంచుకున్నారు. దానితో దిగిన ఫొటోలు, వీడియోలను, అది చేసే అల్లరిని సామ్‌ తరచూ షేర్‌ చేస్తుంటారు. అభిమానులు కూడా ఆ ఫొటోలకు తెగ రియాక్షన్స్‌ ఇస్తుంటారు. అంతేకాదండీ ఇటీవల చైతన్య హష్‌కు ఈత నేర్పించే ప్రయత్నం కూడా చేశారు.


ఫ్యాషన్‌, బ్యూటీ

లుక్స్‌, ఫ్యాషన్‌ పరంగా సమంత ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంటారు. ఆధునిక వస్త్రాలతో పాటు చీరలన్నా సమంతకు చాలా ఇష్టం. ఆమె అభిరుచికి నిశ్చితార్థం చీరే మంచి ఉదాహరణ. ఆ చీరలో తన జీవితంలోని మధుర ఘట్టాలకు సంబంధించిన చిత్రాల్ని డిజైన్‌ వేయించారు. అప్పట్లో ఆ చీర అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాదు ఆమె బ్యూటీ టిప్స్‌ కూడా ఇస్తుంటారు. తను ఉపయోగించే సౌందర్య ఉత్పత్తుల వివరాలను షేర్‌ చేసుకుంటూ ఉంటారు. వాటిని వల్ల కలిగే ప్రయోజనం కూడా చెబుతుంటారు.


‘నా కోడలు ది బెస్ట్‌’

‘సామ్‌ ఉంటే ఆ సినిమా ఇక హిట్టే’.. ఈ మాటలు ఎవరో కాదు ఆమె మామయ్య, అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున స్వయంగా అన్నారు. ఆయన ఇప్పటికే పలు సందర్భాల్లో సామ్‌ను ప్రశంసిస్తూ అనేక మార్లు ట్వీట్లు చేశారు.


చేనేత ప్రచారకర్త

తెలంగాణ చేనేత ప్రచారకర్తగా సమంత పనిచేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలోనూ ఆమె పాల్గొన్నారు. అంతేకాదు సోషల్‌మీడియా వేదికగా చేనేత దుస్తుల్ని ప్రమోట్‌ చేశారు. నల్గొండ తదితర ప్రాంతాల్లోని చేనేత కార్మికుల్ని నేరుగా కలిశారు.


ఇష్టమైన డిసెంబర్‌

మంతకు ఏడాది మొత్తంలో డిసెంబర్‌ అంటే చాలా ఇష్టం. దీనికి కారణం ఆ నెలలో వచ్చే క్రిస్మస్‌. సామ్‌ తన కుటుంబంతో కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఆమే స్వయంగా క్రిస్మస్‌ ట్రీను అందంగా ముస్తాబు చేస్తారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని ఆమె ప్రతి ఏడాది షేర్‌ చేస్తుంటారు.


సందేశాలు..

‘ఎప్పుడూ మీ ఆశల్ని వదులుకోకండి.. ఎందుకంటే గొప్ప పనులు జరగడానికి ఎక్కువ రోజులు పడుతుంది’ అని సమంత ఓ సందర్భంలో అన్నారు. ఇలా ఆమె పలు సందర్భాల్లో తన అభిమానులు, ఫాలోవర్స్‌లో స్ఫూర్తిని నింపుతూ పోస్ట్‌లు కూడా చేస్తుంటారు.


పెళ్లి వీడియో

భిమానుల కోసం సమంత తన పెళ్లి వీడియోను కూడా నెటిజన్లతో పంచుకున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో 25 లక్షల మందికిపైగా చూశారు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.