close

తాజా వార్తలు

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్య

రైల్వే కోడూరు: కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో బుధవారం తెల్లవారు జామున దారుణం జరిగింది. ఓ యువకుడుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేసి దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రంగనాయుకుల పేటకు చెందిన సాబ్‌జాన్‌ కుమారుడు షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌(26) బెంగుళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రంజాన్‌ పండుగ సందర్భంగా బెంగుళూరు నుంచి రైల్వే కోడూరు చేరుకుని బస్సు దిగి ఇంటికి వస్తుండగా శ్రీకృష్ణ సినిమా హాల్ సమీపంలోకి రాగానే దుండగులు అతనిపై దాడిచేసి  హతమార్చారు. ఖాదర్‌కు ఈ నెల 23న వివాహం నిశ్చయమైంది. ఈక్రమంలో యువకుడు హత్యకు గురికావడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు. కేసు నమోదుచేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.