close

తాజా వార్తలు

కీచకుడీ తాత!

సొంత మనవరాలిపై అత్యాచారం, హత్య
చనిపోయాక.. ఆత్మహత్యగా చిత్రీకరణ
మిస్టరీ ఛేదించిన పోలీసులు

బుచ్చిరెడ్డిపాళెం: మనవళ్లు, మనవరాళ్లకు నీతి కథలు చెప్పాల్సిన తాత నీతిబాహ్యమైన పని చేశాడు. సొంత మనవరాలిపైనే అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశాడు. 72ఏళ్ల వయసులో... ఆ దుర్మార్గుడి కబంధ హస్తాల్లో 16ఏళ్ల బాలిక ప్రాణాలొదిలింది. అంతచేసీ మనవరాలు ఆత్మహత్య చేసుకుందని నమ్మించజూశాడు. పోలీసుల దర్యాప్తులో దొరికిపోయాడు. దారుణ ఘటన నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో గత నెల 30న చోటుచేసుకుంది. నిందితుడ్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేష్‌బాబు వెల్లడించారు.

గదర్తి మండలం సున్నపుబట్టీ గ్రామం పాతూరు గిరిజన కాలనీలో ఉప్పు వెంకటేశ్వర్లు (72) నివాసముంటున్నాడు. అతడితో పాటు భార్య రమణమ్మ, కుమార్తె కందల మంగమ్మ, మనవరాలు ఉంటున్నారు. అక్కడ వీరి 3 ఇళ్లే ఉంటాయి. తండ్రీ కుమార్తెలు వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. వెంకటేశ్వర్లు నెల్లూరులోని ఓ లాడ్జిలో పని చేస్తున్నాడు. అతడి కన్ను తన మనవరాలిపై పడింది. అదను కోసం ఎదురుచూశాడు. బాలిక తండ్రి పోలయ్య ట్రాక్టరు డ్రైవర్‌గా నెల్లూరులో పనిచేస్తున్నారు. రెండు రోజులకు ఒకసారి ఆయన ఇంటికి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో పోలయ్య గత నెల 30న తన భార్యకు ఫోన్‌చేసి కుమార్తెకు పెళ్లిచేద్దామని చెప్పారు. మైనరు అయినందున భార్య మంగమ్మ అడ్డుచెప్పింది. వారిమధ్య వాగ్వాదం జరగడంతో మంగమ్మ అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెను వెదుకుతూ ఆమె తల్లి రమణమ్మ వెళ్లింది. ఇంట్లో మనవరాలు ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన తాత వెంకటేశ్వర్లు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ప్రతిఘటించడంతో తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తర్వాత కామవాంఛ తీర్చుకున్నాడు. దీంతో బాలిక చనిపోయింది. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా ఆమె ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించాడు. తల్లిదండ్రులు తన పెళ్లి విషయంలో గొడవపడ్డారనే మనస్తాపంతో ఆమె ఉరి వేసుకున్నట్లు నమ్మబలికాడు. అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు చెప్పినట్లు ఉరి వేసుకుంటే బాలిక మెడపై గుర్తులుండాలి. కానీ ఎలాంటి గుర్తులూ లేవు. పైగా మృతురాలి తాత, అమ్మమ్మలు పొంతన లేని సమాధానాలు చెప్పారు. బాలిక తన మెడలోని చున్నీతో ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించి, దూలానికి చున్నీ కట్టి తన ఇంట్లోని కత్తితో ఆ చున్నీని కత్తిరించాడు. ఆ కత్తి ఎక్కడిదని పోలీసులు అడగ్గా.. మృతురాలి ఇంట్లోనిదేనని చెప్పాడు. కానీ ఆ కత్తిని తన తండ్రి వెంకటేశ్వర్లు వాడతాడని, అది ఆయన ఇంట్లోనే ఉంటుందని మృతురాలి తల్లి మంగమ్మ చెప్పడంతో అసలు విషయం బయటపడింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.