close

తాజా వార్తలు

డిప్యూటీ స్పీకర్ పదవి బిజూకు దక్కేనా!

దిల్లీ: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఈ ఆదివారం సమావేశం జరగనున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ పదవిని బిజూ జనతాదళ్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పదవిపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

గత లోక్‌సభలో అన్నాడీఎంకే ఆ పదవిని నిర్వహించింది. అయితే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. అన్నాడీఎంకే ఎన్డీయే మిత్రపక్షం కాకపోయినా 2014 ఎన్నికల అనంతరం ఆ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టింది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై సొంతంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఎన్డీయే కాంగ్రెస్‌కు ఆ ఆఫర్ ఇవ్వడానికి సుముఖంగా లేదని తెలుస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.