close

తాజా వార్తలు

కో-ఆప్షన్‌ సభ్యునిగా కలెక్టర్‌ భర్త

ధర్మపురి గ్రామీణం: వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానం భర్త కైసర్‌ హమ్మద్‌ జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కైసర్‌ స్వస్థలం ధర్మపురి మండలం రాయపట్నం. 1996లో ఆయన పంచాయతీ వార్డు సభ్యుడిగా, 2002లో తిమ్మాపూర్‌ సహకార సంఘం కో-ఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గతంలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్న కైసర్‌ కొన్నేళ్లుగా వాటికి దూరంగా ఉంటున్నారు. మండల పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో తెరాస నాయకులు ఆయన్ని తెరపైకి తీసుకొచ్చారు. శుక్రవారం ఎంపీటీసీ సభ్యులు ఆయన్ని కో-ఆప్షన్‌ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.