close

తాజా వార్తలు

సిద్ధూకి ఛాన్స్‌ ఇవ్వని అమరీందర్‌!

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, ఆ పార్టీ నేత, రాష్ట్ర మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మధ్య ఏర్పడిన వివాదం రోజురోజుకీ ముదురుతోంది. తాజాగా..వివిధ పథకాల అమలు తీరు పరిరశీలనకై వేసిన ఎనిమిది పర్యవేక్షక బృందాల నుంచి సిద్ధూని అమరీందర్‌ దూరం పెట్టారు. వివిధ పథకాల అమలు, వాటి లబ్ధిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిలో చేయాల్సిన మార్పులు చేర్పులను ప్రభుత్వానికి సూచించడమే ఈ బృందాల పని. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలను మరింత ప్రభావవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని గమనించిన నేపథ్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. అయితే వీటిలో ఒక్క దానిలోనూ సిద్ధూ లేకపోవడం గమనార్హం. దీంతో వీరివురి మధ్య ఉన్న వివాదాలు తారస్థాయికి చేరినట్లు అర్థమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సిద్ధూ ఇప్పటి వరకు స్థానిక సంస్థలు, పర్యాటకం, సాంస్కృతిక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన్ని ఈ బాధ్యతల నుంచి తప్పిస్తూ గురువారం సీఎం అమరీందర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. వీటి స్థానంలో విద్యుత్ శాఖను ఆయనకు కేటాయించారు. అయితే ఈ శాఖను తీసుకోవడానికి సిద్ధూ నిరాకరిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. శుక్రవారం ఈ శాఖ బాధ్యతలు తీసుకోవాల్సి ఉండగా ఆయన సచివాలయానికి వెళ్లకపోవడం గమనార్హం.

ఈ విషయమై త్వరలో అమరీందర్‌, సిద్ధూ విడివిడిగా దిల్లీకి వెళ్లి పార్టీ అధిష్ఠానంతో చర్చించనున్నట్లు సమాచారం. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారానికి సిద్ధూ హాజరైన నాటి నుంచి వీరివురి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ విఫలం కావడానికి సిద్ధూనే కారణమంటూ అమరీందర్‌ చేసిన ఆరోరపణలతో వివాదం మరింత ముదిరినట్లయింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.