
తాజా వార్తలు
పట్నా: భారతీయ జనతా పార్టీతో నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో తమ భాగస్వామ్యం బిహార్ వరకు మాత్రమే పరిమితమని జేడీయూ స్పష్టంచేసింది. త్వరలో జరగబోయే జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, హరియాణా, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ పేర్కొంది. ఆదివారం జరిగిన పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు ఆ పార్టీ నిర్ణయం వెలువడింది.
బిహార్‌లో భాజపా-జేడీయూ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలతో పాటు ఎల్జేపీ కూడా కలిసి పోటీ చేసింది. ఫలితాల అనంతరం జేడీయూకు ఒక్క కేంద్రమంత్రి పదవినే భాజపా ఇవ్వజూపడంతో అందుకు బిహార్ సీఎం నితీశ్ నిరాకరించారు. అందుకు ప్రతిగా ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించి అందులో తమ పార్టీ నేతలకే పదవులను కట్టబెట్టారు. కేవలం ఒక్క మంత్రి పదవినే భాజపాకు ఇవ్వజూపారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడింది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు నితీశ్ కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తెలుగువాళ్లందరికీ నేను వెంకీ మామనే: వెంకటేష్
- ‘నీ నుంచి నన్నెవరూ దూరం చేయలేరు మామ’
- వాట్సప్‌లో కాల్ వెయిటింగ్ ఫీచర్
- శోభన్‌బాబుగా విజయ్ దేవరకొండ..?
- అలా స్టేటస్లు పెట్టుకోవడం చూసి బాధపడ్డా
- ‘అతినిద్ర లక్షణాలు ఇవే’..!
- ఎన్టీఆర్ తీరని కోరిక!
- గతం గతః అంటున్న రాహుల్.. శ్రీముఖి
- వెంకీ డైలాగ్: రాశీ-పాయల్ టిక్‌టాక్..!
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
