close

తాజా వార్తలు

వారి ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు: మమత

కోల్‌కతా: భారతీయ జనతా పార్టీ తన కార్యకర్తల ద్వారా బెంగాల్‌లో హింసను ప్రేరేపిస్తోందని.. తన ప్రభుత్వాన్ని పడగట్టే ప్రయత్నాలు చేస్తుందంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా భాజపా విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నది తాను ఒక్కరేనని.. అలాంటి తనని భాజపా అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని మమత ఆరోపించారు. స్థానిక సామాజిక మాధ్యమాల ద్వారా బెంగాల్‌లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేందుకుగాను భాజపా కోట్లు ఖర్చు చేస్తుందని ఆరోపించారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు భాజపా కార్యకర్తలు బెంగాల్‌లో హింసను ప్రేరేపిస్తున్నారని సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ మమత వెల్లడించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటే వాటిని అదుపులోని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందని మమత ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే బెంగాల్‌ విషయంలో కేంద్రం వైఖరి మరోలా ఉందంటూ మమత ధ్వజమెత్తారు.

‘భాజపా కావాలనే బెంగాల్‌లో హింసను ప్రేరేపిస్తుంది. ఇది పూర్తిగా ప్రణాళిక ప్రకారం జరుగుతున్న కుట్ర. భాజపా అవలంబిస్తున్న విధానాలకు ఎదురొడ్డి నిలిచేది మమత ఒక్కరే అని వారికి తెలుసు. అందుకే నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని వారు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించవు. బెంగాల్‌లో చెలరేగుతున్న గొడవలకు పూర్తి బాధ్యత వారిదే. దీనికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కాదు. ఈ హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీనిపై నేను మాట్లాడదల్చుకోలేదు. ఈ అల్లర్లకు సంబంధించి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి అందించారు’ అంటూ కేంద్రం ప్రభుత్వంపై మమత విరుచుపడ్డారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కూడా బెంగాల్‌లో తృణముల్‌, భాజపా కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ గొడవల్లో ఇప్పటికే నలుగురు కార్యకర్తలు మృతిచెందారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.