
తాజా వార్తలు
దిల్లీ: గాయం కారణంగా భారత ఓపెనర్ శిఖర్ ధావన్ మూడు వారాల పాటు జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధావన్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడిని ఎంపిక చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పనేనని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ‘ధావన్ వంటి కీలక ఆటగాడు జట్టుకు దూరం కావడం భారత్‌కు కచ్చితంగా ప్రతికూల పరిస్థితే. అందులోనూ మూడు వారాలు అంటే దాదాపు సగం టోర్నమెంట్ పూర్తి అవుతుంది. ప్రత్యామ్నాయంగా కేఎల్ రాహుల్ అందుబాటులో ఉన్నా అతను ఇటీవల ఓపెనింగ్‌కు దిగిన సందర్భాలు లేవని.. ధావన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని ఎంపిక చేయడం యాజమాన్యానికి సవాలుతో కూడుకున్న పనే.’ అని హర్భజన్ తెలిపాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో తన దృష్టిలో ధావన్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లలో రిషబ్ పంత్, అజింక్యా రహానె ముందు వరుసలో ఉంటారని భజ్జీ అన్నాడు. అనుభవంపరంగా కానీ.. ఇంగ్లాండ్ పిచ్‌లను దృష్టిలో పెట్టుకొని చూసిన రహానె కచ్చితంగా కీలక ఆటగాడు. సాధారణంగా అతను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడు. కానీ ఇటీవల మూడో స్థానంలోనూ ఆడగలిగే టెక్నిక్ సాధించాడు. గత ప్రపంచకప్(2015)లోనూ జట్టుకు ఉపయుక్తకరమైన ఇన్నింగ్‌లు ఆడాడని ఈ వెటరన్ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. ఇక రిషబ్ పంత్‌కు మాత్రం తాను తొలి ప్రాధాన్యతనిస్తానని.. కానీ అనుభవం విషయానికొస్తే మాత్రం రహానెను ఎంచుకుంటానని హర్భజన్ వెల్లడించాడు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రఘురామ కృష్ణరాజువిందుకు రాజ్‌నాథ్‌సింగ్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
