Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111100
            [news_title_telugu_html] => 

భాజపా కార్యకర్తలర్యాలీలోఉద్రిక్తత

[news_title_telugu] => భాజపా కార్యకర్తలర్యాలీలోఉద్రిక్తత [news_title_english] => Kolkata police baton charge at BJP workers on Bepin Behari Ganguly Street [news_short_description] => రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా బుధవారం భారతీయ జనతా పార్టీ చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. [news_tags_keywords] => Kolkata,police,BJP,WestBengal [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-12 20:32:56 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భాజపా కార్యకర్తలర్యాలీలోఉద్రిక్తత - Kolkata police baton charge at BJP workers on Bepin Behari Ganguly Street - EENADU
close

తాజా వార్తలు

భాజపా కార్యకర్తలర్యాలీలోఉద్రిక్తత

కోల్‌కతా (పశ్చిమ బెంగాల్‌): రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా బుధవారం భారతీయ జనతా పార్టీ చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ర్యాలీ నిర్వహించాలని భాజపా రెండు రోజుల క్రితమే నిర్ణయం తీసుకుంది. బుధవారం భాజపా కార్యకర్తలు కోల్‌కతాలోని బెపిన్‌ బెహారీ గంగూలీ వీధి ప్రాంతానికి చేరుకున్న సమయంలో వారిని రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు తమ ర్యాలీని కొనసాగించే విషయంలో వెనక్కి తగ్గలేదు. బారికేడ్‌లపై ఎక్కి ముందుకు వెళ్లాలని వారు ప్రయత్నించడంతో పోలీసులు.. వారిపై వాటర్‌కేనన్స్‌, బాష్పవాయువును ప్రయోగించారు. దీంతో భాజపా కార్యకర్తలు పశ్చిమ బెంగాల్‌ సర్కారుకు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు.  

బుధవారం ర్యాలీ నిర్వహస్తామని భాజపా ముందుగానే ప్రకటించడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా భాజపా కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయి. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. అందుకే మేము ఈ ర్యాలీని నిర్వహించనున్నాం’’ అంటూ ఇటీవల రాష్ట్ర సీనియర్‌ భాజపా నేత జైప్రకాశ్‌ మజుందార్‌ ప్రకటించారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా భాజపా, టీఎంసీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ హింసలో ఇప్పటివరకు ఇరు పార్టీలకు చెందిన 10 మంది కార్యకర్తలు మృతి చెందినట్లు సమాచారం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.