Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111127
            [news_title_telugu_html] => 

బీఎస్‌-6 ఇంజిన్‌తో కొత్త యాక్టివా

[news_title_telugu] => బీఎస్‌-6 ఇంజిన్‌తో కొత్త యాక్టివా [news_title_english] => HMSI unveils Activa 125 with BS VI engine [news_short_description] => ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) బుధవారం బీఎస్‌-6 ఇంజిన్‌ కలిగిన యాక్టివా 125 సీసీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ ఆర్థిక సంవత్సరం......... [news_tags_keywords] => Honda,Activa 125 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-12 16:18:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బీఎస్‌-6 ఇంజిన్‌తో కొత్త యాక్టివా - HMSI unveils Activa 125 with BS VI engine - EENADU
close

తాజా వార్తలు

బీఎస్‌-6 ఇంజిన్‌తో కొత్త యాక్టివా

దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) బుధవారం బీఎస్‌-6 ఇంజిన్‌ కలిగిన యాక్టివా 125 సీసీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం చివరి నుంచి ఈ వాహనాలను విక్రయిస్తామని వెల్లడించింది. ఎప్పుడూ ఉన్నత సాంకేతికతకు పెద్దపీట వేసే తాము ఆ దిశగా మరోమారు సిద్ధమైనట్లు హెచ్‌ఎంఎస్‌ఐ  ప్రెసిడెంట్‌, సీఈవో మినోరు కటో తెలిపారు. దశలవారీగా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. బీఎస్‌-4తో పోలిస్తే బీఎస్‌-6 యాక్టివా.. 10 నుంచి 15 శాతం అధిక ధర ఉండబోతోందని చెప్పారు. ప్రస్తుతం ఈ వెర్షన్‌ ధర రూ.64,733 (ఎక్స్‌ షోరూం దిల్లీ)  వరకు ఉండనుంది. బీఎస్‌-6 యాక్టివా 125ను తీసుకొస్తున్న నేపథ్యంలో బీఎస్‌-4 ఇంజిన్‌ కలిగిన యాక్టివా 125 తయారీని కంపెనీ  నిలిపివేయనుందని ఆ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) యద్‌వీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. కొత్త యాక్టివాలో  కుదుపుల్లేకుండా స్టార్టయ్యే ఇంజిన్‌, ప్రొగ్రామ్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌, డిజిటల్‌ అనలాగ్‌ మీటర్‌ వంటి నూతన సదుపాయాలను తీసుకొస్తున్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.