Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111159
            [news_title_telugu_html] => 

కమల దళపతి ఎవరో?

[news_title_telugu] => కమల దళపతి ఎవరో? [news_title_english] => BJP mulling on National president election [news_short_description] => భాజపా నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు ప్రారంభమైంది. రేపు ఉదయం 11గంటలకు భాజపా కీలక సమావేశం జరగనుంది. రేపటి భేటీ తర్వాత నూతన అధ్యక్షుడి ఎంపికకు షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. [news_tags_keywords] => BJP,National president,Amith shah,politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/d1hi2IZuM8w [news_videoinfo] => |https://www.youtube.com/embed/d1hi2IZuM8w [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-12 17:50:14 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కమల దళపతి ఎవరో? - BJP mulling on National president election - EENADU
close

తాజా వార్తలు

కమల దళపతి ఎవరో?

దిల్లీ: భాజపా నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు ప్రారంభమైంది. రేపు ఉదయం 11గంటలకు భాజపా కీలక సమావేశం జరగనుంది. రేపటి భేటీ తర్వాత నూతన అధ్యక్షుడి ఎంపికకు షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. 2018 డిసెంబర్‌లోనే జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌ షా పదవీ కాలం ముగిసింది. అప్పటికే సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమైన తరుణంలో కొత్త అధ్యక్షుడి ఎన్నికకు వెళ్లడం కొంత ఇబ్బందికరమని భావించిన పార్టీ అధిష్ఠానం.. అమిత్‌షాను మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయించింది. ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికలు ముగియడం.. దేశంలో భాజపా విజయ ఢంకా మోగించడం.. మోదీ నేతృత్వంలో వరుసగా రెండోసారి కొత్త సర్కార్‌ కొలువుదీరడం.. మంత్రివర్గం ఏర్పాటు.. కేబినెట్‌లో అమిత్‌ షా హోంమంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టిన తరుణంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరిని ఎంపిక చేయాలి? ఏయే అంశాలను ప్రాతిపదికలు తీసుకోవాలనే దానిపై భాజపా అధిష్ఠానం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 11గంటలకు భేటీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. పదాధికారులు, పార్టీ ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నారు. 

ఈ భేటీలో అధ్యక్ష పదవికి సంబంధించి ప్రధానంగా ఎవరెవరు రేసులో ఉన్నారనే అంశంపై స్పష్టత రానుంది. దాంతో పాటు కొత్త అధ్యక్షుడి ఎంపిక ఎప్పుడు ఉండబోతోంది? నామినేషన్ల ప్రక్రియ తదితర అంశాలకు సంబంధించి షెడ్యూల్‌ను సైతం రేపు విడుదల చేసే అవకాశం కనబడుతోంది. ఎన్నికలు ముగిసిన వెంటనే పలువురు నేతల పేర్లు బయటకు వచ్చినప్పటికీ కొంతమందిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవడంతో అవన్నీ పక్కకుపోయాయి. ప్రస్తుతం మంత్రి పదవి రాని భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి జేపీ నడ్డా పేరు పరిశీలనలో ఉంది. మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్‌ పేరు సైతం ముందుకొచ్చినప్పటికీ.. ఆయనకు కేబినెట్‌లో చోటుదక్కడంతో ఆ పేరును పరిశీలనలోకి తీసుకొనే అవకాశం లేనట్టు పార్టీ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. భాజపా ప్రధాన కార్యదర్శులుగా ఉన్న రాంమాధవ్‌, మురళీధర్‌ రావుల పేర్లు విన్పిస్తున్నప్పటికీ.. వారికి అధ్యక్ష స్థాయి ఇవ్వడానికి ఇంకా మరికొంత సమయం ఉందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి పేరును ప్రకటిస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది గనక ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసేందుకు అమిత్‌ షా పూనుకున్నారు. ఈ నెల 17 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సమావేశాలు ముగిసే లోపే భాజపా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తిచేయడం.. అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం జరిగిపోతుందని భాజపా వర్గాలు పేర్కొంటున్నాయి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.