close

తాజా వార్తలు

డ్రోనుతో ఆహారం డెలివరీ!

తొలిసారి పరీక్షించిన జొమాటో

న్యూదిల్లీ: ఆన్‌లైన్ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటో.. తొలిసారి ఆహారాన్ని డ్రోను సాయంతో చేరవేసే పరీక్షను నిర్వహించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం మీడియాకు వివరించారు. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వినియోగదారుడికి హైబ్రీడ్‌ డ్రోనుతో 10 నిమిషాల్లో ఆహార పొట్లాన్ని చేరవేసే పరీక్ష విజయవంతమైందని ఆ సంస్థ తెలిపింది. ఆ డ్రోను గంటలకు 80 కి.మీ వేగంతో ప్రయాణించిందని తెలిపారు. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆమోదం పొందిన ఒక రిమోట్‌ సైట్‌ ప్రాంతంలో ఈ ప్రయోగాన్ని చేశామని పేర్కొంది. ఇటువంటి పరీక్షలు చేసేందుకు ఆ రిమోట్ సైట్‌ రూపకల్పన చేశారని చెప్పింది.

ఈ ప్రయోగాన్ని ఏ ప్రాంతంలో చేశామన్న విషయాన్ని ఆ సంస్థ వెల్లడించలేదు. ఆకాశ మార్గం ద్వారా చాలా తొందరగా ఫుడ్‌ డెలివరీ చేయొచ్చని, సమయాన్ని సగానికి తగ్గించవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు అన్నారు. రోడ్డు మార్గంలో డెలివరీ చేస్తే చాలా సమయం పడుతుందని డ్రోన్ల ద్వారా చేస్తే త్వరగా వినియోగదారుడికి అందుతుందని చెప్పారు. డ్రోన్‌ల ద్వారా డెలివరీ కోసం తాము సుస్థిరమైన, సురక్షితమైన టెక్నాలజీ దిశగా పనిచేస్తున్నామని తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.