close

తాజా వార్తలు

భారత్‌×పాక్‌: ఫోర్క్‌లతో దాడికి సిద్ధమయ్యాం

మాంచెస్టర్‌: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో హై టెన్షన్‌ మ్యాచ్‌కు వేళైంది. ఆదివారం భారత్‌, పాక్‌ సమరం జరగనుంది. అభిమానుల్లో భావోద్వేగం కట్టలు తెంచుకుంటోంది. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలో 2003 ప్రపంచకప్‌లో మహ్మద్‌ యూసుఫ్‌తో ఎందుకు గొడవపడ్డాడో హర్భజన్‌సింగ్‌ వెల్లడించాడు. అప్పుడు చేతుల్లో ఫోర్కులు పట్టుకొన్న ఇద్దరూ దాదాపు దాడి చేసుకొనేందుకు సిద్ధమయ్యారు. వసీమ్‌ అక్రమ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, జవగళ్‌ శ్రీనాథ్‌ లాంటి దిగ్గజాలు వారిని విడదీయాల్సి వచ్చింది. కాగా ఇప్పుడా ఘటన గుర్తుచేసుకొని నవ్వుకుంటున్నాడు భజ్జీ.

ఆ మ్యాచ్‌లో పాక్‌ 270కి పైగా పరుగులు చేసింది. లక్ష్యఛేదన అంత సులభమేమీ కాదు. సచిన్‌ 98 పరుగులు చేసి విజయం అందించాడు. ఇంతకీ అక్కడ గొడవకు కారణం ఏంటంటే... ‘ఇదంతా ఒక జోక్‌తో మొదలైంది. పాక్‌పై మంచి రికార్డు ఉండటంతో నా బదులు అనిల్‌ కుంబ్లే భాయ్‌ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. నేను కాస్త నిరాశకు లోనయ్యా. నేను తుది 11 మందిలో లేనప్పుడు ఆ ఘటన చోటుచేసుకుంది’ అని భజ్జీ చెప్పాడు.

‘భోజన విరామంలో నేను ఒక టేబుల్‌ వద్ద కూర్చున్నాను. నా కుడిపక్కన టేబుల్‌ వద్ద యూసుఫ్‌, షోయబ్‌ అక్తర్‌ కూర్చుకున్నారు. యూసుఫ్‌, నేను పంజాబీ మాట్లాడతాం. అకస్మాత్తుగా ఒకరిపై ఒకరం సెటైర్లు వేసుకున్నాం. అతడు ముందు నాపై వ్యక్తిగత విమర్శ చేశాడు. ఆ తర్వాత మతంపై చేశాడు. అతడికి నేను ఘాటుగా బదులిచ్చాను. ఇతరులు గుర్తించేలోపే మేమిద్దరం చేతుల్లో ఫోర్కులతో సిద్ధంగా ఉన్నాం. కూర్చీల్లోంచి లేచి దాడి చేసుకొనేందుకు ముందుకొచ్చాం. రాహుల్‌ ద్రవిడ్‌, జవగళ్‌ శ్రీనాథ్‌ నన్ను ఆపారు. యూసుఫ్‌ను వసీమ్‌ భాయ్‌, సయీద్‌ పక్కకు తీసుకెళ్లారు. రెండు జట్ల సీనియర్లు మా ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగి 16 ఏళ్లయింది. ప్రస్తుతం యూసుఫ్‌ నేను ఎదురుపడ్డప్పుడు చక్కగా నవ్వుకుంటాం’ అని హర్భజన్‌ తెలిపాడు.

టీమిండియా రెండోసారి ప్రపంచకప్‌ గెలిచిన 2011లో పాక్‌పై హర్భజన్‌ కీలక పాత్ర పోషించాడు. ‘ఆ మ్యాచ్‌ కథ వేరు. సగటు న్యాయం పనిచేస్తుందని ప్రజలు భావించారు. మొహాలి నా సొంత మైదానం. అందరూ మేం గెలవాలని కోరుకున్నారు. చాలా హైప్‌ సృష్టించారు’ అని భజ్జీ అన్నాడు. పాక్‌ క్రికెటర్లతో భారత ఆటగాళ్లకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. ‘షాహిద్‌, అక్తర్‌తో నాకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. మేము ఆలింగనం చేసుకుంటాం. కలిసి భోజనం చేస్తాం. మేం ఒకే భాషలో మాట్లాడతాం. ఆహారం, సంగీతం మొదలైనవి ఒకేలా ఉంటాయి. ఇవన్నీ బౌండరీ సరిహద్దుకు బయటే. ఒక్కసారి బరిలోకి దిగామంటే మితృత్వం వెనక్కి వెళ్లిపోతుంది’ అని హర్భజన్‌ పేర్కొన్నాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.