close

తాజా వార్తలు

మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ

ముంబయి : మహారాష్ట్రలో రేపు మంత్రివర్గ విస్తరణ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ప్రకటించారు. ‘మేము మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నాం. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు సరైన సమయంలోనే వెల్లడిస్తామని’ ఆయన విలేకరులతో అన్నారు. మంగళవారమే ఆర్థికమంత్రి సుధీర్‌ ముంగతివర్‌ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు ముందే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని శివసేన, ఎన్డీయే మిత్రపక్షాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ విస్తరణ ప్రక్రియ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 
ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన వీఖే పాటిల్‌కు వ్యవసాయశాఖ బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పాటిల్‌ ఇటీవలే ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఆయన కుమారుడు సుజయ్‌ ఈ లోక్‌సభ ఎన్నికల్లో అహ్మద్‌నగర్‌ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతోనే సుజయ్‌ భాజపాలో చేరారు. అయితే మంత్రివర్గంలో పాటిల్‌కు స్థానం దక్కుతుందా? లేదా? అనే విషయంపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. శుక్రవారమే ఫఢణవీస్‌ మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రేలతో సమావేశమై మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.