Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112385
            [news_title_telugu_html] => 

విలాసవంతమైన గదులు,అత్యాధునిక సౌకర్యాలు

[news_title_telugu] => విలాసవంతమైన గదులు,అత్యాధునిక సౌకర్యాలు [news_title_english] => Arthur Road cell for Nirav Mallya to have French windows water [news_short_description] => సీలింగ్‌ను తాకేలా పొడవైన ఫ్రెంచ్‌ కిటికీలు..టాయిలెట్లు, 24 గంటలు నీటి సదుపాయం.. తాజాగా తెల్లటి పెయింట్‌ వేసి నిగనిగలాడుతున్న గోడలు.. ఫ్యాన్లు, కళ్లు జిగేలు మనిపించే లైట్లు.. మెత్తటి పరుపులున్న విలాసవంతమైన మంచాలు..సీసీ కెమెరాలు.. [news_tags_keywords] => Nirav Modi,Vijay Mallya, Arthur Road prison [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-16 01:46:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
విలాసవంతమైన గదులు,అత్యాధునిక సౌకర్యాలు - Arthur Road cell for Nirav Mallya to have French windows water - EENADU
close

తాజా వార్తలు

విలాసవంతమైన గదులు,అత్యాధునిక సౌకర్యాలు

మాల్యా, నీరవ్‌ మోదీల కోసం జైలు గదులు సిద్ధం

ముంబయి: సీలింగ్‌ను తాకేలా పొడవైన ఫ్రెంచ్‌ కిటికీలు..టాయిలెట్లు, 24 గంటలు నీటి సదుపాయం.. తాజాగా తెల్లటి పెయింట్‌ వేసి నిగనిగలాడుతున్న గోడలు.. ఫ్యాన్లు, కళ్లు జిగేలు మనిపించే లైట్లు.. మెత్తటి పరుపులున్న విలాసవంతమైన మంచాలు..సీసీ కెమెరాలు.. ఇవేవో ధనవంతులు వెళ్లే రిసార్టుల్లోని సదుపాయాలనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇవి ఏ రిసార్టుల గదులో..ఐదు నక్షత్రాల హోటళ్ల రూమ్‌లో ఉండే సదుపాయాలో కాదు. బ్యాంకులకు రూ. వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఆర్థిక నేరస్థులు ఉండబోయే జైలు గదులు. మీరు చూసింది..చదివింది నిజమే. ఈ సకల సౌకర్యాలన్నీ మాజీ లిక్కర్‌ కింగ్ విజయ్‌ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ కోసమే.

ఈ ఇద్దరికీ శిక్ష పడితే వీరు ఉండబోయేది ఇదే జైల్లో. ఇంతకీ ఆ జైలు ఎక్కడుందో చెప్పలేదు కదూ!. ముంబయిలోని లోయర్‌ పారెల్‌ పరిథిలోని జేఆర్‌ బొరీచా మార్గంలో ఉందిది. దీనిపేరు ఆర్థర్‌ రోడ్‌ జైలు. బుధవారం నీరవ్‌ మోదీకి సంబంధించిన బెయిల్ పిటిషన్‌ను యూకే కోర్టు కొట్టివేసింది. ఇలా బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురవ్వడం ఇది నాలుగో సారి. దీంతో ముంబయి పోలీసులు జైలు గదిని సిద్ధం చేస్తున్నారు. సెల్‌లో సీసీ కెమెరాలు కూడా అమర్చారు. వీటిని 24x7 పర్యవేక్షిస్తుంటారు. కేవలం వీరి కదలికలు గుర్తిండచానికే కాకుండా కోర్టు ఎప్పుడైనా వీరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడదలిస్తే అందుకు ఉపయోగంగా ఉంటాయని వీటిని అమర్చారు. ఇక విజయ్‌ మాల్యా కేసు కూడా జులైలో విచారణకు రానుంది. ఇతడికి కూడా శిక్ష పడే అవకాశం ఉండటంతో ఇద్దరినీ ఒకే సెల్‌లో ఉంచుతారని సమాచారం. సాధారణంగా అక్కడి జైల్లో ముగ్గురు ఖైదీలను ఉంచుతారు. కానీ వీరిద్దరి విషయంలో మాత్రం కాస్త మార్చినట్లు తెలుస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.