close

తాజా వార్తలు

గెలిచినా.. ఓడినా.. జీవితమేమీ అంతమవ్వదు

భారత్‌×పాక్‌ మ్యాచ్‌ ముందు మీడియా సమావేశంలో కోహ్లీ

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో దాయాదుల సమరంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భారత్‌×పాక్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారిలో భావోద్వేగం పొంగిపొరలుతున్నా తమ దృష్టి మాత్రం ప్రపంచకప్‌ గెలవడంపైనే ఉందని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. దాయాదుల పోరుకు ముందు మీడియాతో మాట్లాడాడు. తమ ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించాడు. భారత్‌×పాక్‌ మ్యాచ్‌పై బయట నెలకొన్న హైప్‌పై విరాట్‌ స్పందించాడు.

జీవితం ముగిసిపోదు!

ఆట కచ్చితమైన ఒక సమయంలో మొదలవుతుంది. ఒక సమయంలో ముగుస్తుంది. మా ప్రదర్శన బాగున్నా బాగాలేకున్నా జీవితానికిదేమీ అంతం కాదు! మ్యాచ్‌లో మేం బాగా ఆడినా ఆడకున్నా దీంతో ఏమీ ముగిసిపోదు. టోర్నీ సుదీర్ఘంగా సాగుతుంది. మా దృష్టి భారీ లక్ష్యంపై ఉంది. ఎవరూ ఒత్తిడి తీసుకోవడం లేదు. పదకొండు మంది ఈ బాధ్యత తీసుకుంటారు. వాతావరణం మా చేతుల్లో ఉండదు. ఎంతసేపు వీలైతే అంత సమయం ఆడతాం. దేనికైనా మేం మానసికంగా సిద్ధంగానే ఉన్నాం.

విరాట్‌×ఆమిర్‌ పోరుపై

టీవీ రేటింగులు పెరగడం కోసమో, వార్తలకు కేంద్ర బిందువుగా మారేందుకో నేనేమీ చెప్పను. ఏ బౌలరైనా సరే నేను చూసేది ఎరుపు లేదా తెలుపు బంతి. అవును, నేను బౌలర్‌ నైపుణ్యాలను గౌరవిస్తా. కాగిసో రబాడ గురించీ అదే చెప్పా. ప్రపంచ క్రికెట్‌లో ప్రభావం చూపించే బౌలర్లు, వారి బలాల గురించి ఆందోళన చెందక తప్పదు. అదే సమయంలో మనపై మనకు గట్టి నమ్మకం ఉండాలి. పరుగులు చేయగలమన్న ధీమా ఉండాలి. మ్యాచ్‌ ఫలితం నా ప్రదర్శనపై లేదా ఆమిర్‌పై ఆధారపడదు. ఒక రకమైన పోటీలో గెలిచేందుకు మైదానంలోకి వెళ్లి నన్ను నేను నిరూపించుకోను. అలాంటివి ప్రోత్సహించను. భవిష్యత్తులోనూ చేయను. ఒక్కోసారి పార్ట్‌టైమ్‌ బౌలర్‌కూ దొరికిపోవచ్చు. ఇలాంటి విషయాలన్ని నేను ప్రాథమిక స్థాయిలోనే ఉంచుతాను.

మీర్పూర్‌లో పాక్‌పై 183పై

పాక్‌పై కోహ్లీ కొన్ని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. మీర్పూర్‌లో అతడి 183 పరుగుల ఇన్నింగ్స్‌పై విలేకరులు మాట్లాడగా ఇతరుల భాగస్వామ్యం గురించీ విరాట్‌ గుర్తుచేశాడు. ‘మీరు మీర్పూరు గురించి మాట్లాడితే ఆ మ్యాచ్‌లో రోహిత్‌ అద్భుతంగా ఆడాడు. మేమిద్దరం భారీ భాగస్వామ్యం నెలకొల్పాం. ధోనీ, రైనా ఆటను ముగించారు. మొదట సచిన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. లక్ష్యం 340 అయితే నేనేమీ 330 చేయలేదుగా. నా ఆటకు బయట గుర్తింపు రావడం మంచిదే. అయితే డ్రస్సింగ్‌ రూమ్‌లో అందరి కష్టాన్ని గుర్తించడమెలాగో మాకు తెలుసు’ అని కోహ్లీ అన్నాడు.

ఆటగాళ్ల దృక్పథం వేరు

ఒక వైపు నుంచే మాత్రమే అభిమానులు ఆలోచించాలని నేను చెప్పను. ఆటకు సంబంధించి మాకో ప్రొఫెషనల్‌ పద్ధతి ఉంది. మేము ఎక్కువగా భావోద్వేగానికి గురవ్వం. ఆత్రుత పెంచుకోము. అభిమానులతో పోలిస్తే ఆటగాళ్ల ఆలోచనా పద్ధతి భిన్నంగా ఉంటుంది. మైదానంలో మా దేహభాష వేరుగా ఉంటుంది. అర సెకనులోనూ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ అభిమానులు క్రికెటర్ల తరహాలో ఆలోచించడం సులభం కాదు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.