
తాజా వార్తలు
దిల్లీ: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో లోక్‌సభలో ‘జై శ్రీరాం’ నినాదాలు హోరెత్తాయి. వారిద్దరినీ పేరు పెట్టి ఆహ్వానిస్తున్న సమయంలో తోటి భాజపా ఎంపీలు నినాదాలు చేశారు. పరోక్షంగా మమత బెనర్జి లక్ష్యంగా ఈ నినాదాలు చేయడం గమనార్హం.
పశ్చిమ బెంగాల్లో ‘జై శ్రీరాం’ నినాదాలు చేసిన వారిపై మమత బెనర్జి విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మమత వెళుతుండగా ‘జై శ్రీరాం’ అని నినదించిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అటు మమతకు, భాజపా నేతల మధ్య మాటలయుద్ధం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన భాజపా సభ్యులు బాబుల్ సుప్రియో, దేవిశ్రీ చౌదరి ఎంపీలుగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించే సమయంలో తోటి సభ్యులు ‘జై శ్రీరాం’ నినాదాలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో మొత్తం 42 సీట్లను గాను 18 సీట్లను భాజపా గెలుచుకున్న సంగతి తెలిసిందే.
I Babul Supriyo having been elected a Member of the House of the People do solemnly affirm that
— Babul Supriyo (@SuPriyoBabul) June 17, 2019
I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India.... pic.twitter.com/nQAfr3HKvb
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- కోహ్లీ×విలియమ్స్: గెలుపెవరిదో చూడాలి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
