Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113745
            [news_title_telugu_html] => 

మసకబారుతున్న ‘మేడిన్‌ చైనా’ ..!

[news_title_telugu] => మసకబారుతున్న ‘మేడిన్‌ చైనా’ ..! [news_title_english] => The era of Made in Chinais over says world’s top bicycle maker [news_short_description] => ‘‘మేడిన్‌ చైనా’ యుగం ఇక ముగిసింది’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ప్రపంచలోనే అత్యధికంగా సైకిళ్లను తయారు చేసే జెయింట్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ కో సంస్థ అధ్యక్షురాలు బొన్నె టూ . అమెరికాకు చెందిన ఆర్డర్ల కోసం పనిచేసే [news_tags_keywords] => China,trader war,trump [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-18 13:37:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మసకబారుతున్న ‘మేడిన్‌ చైనా’ ..! - The era of Made in Chinais over says world’s top bicycle maker - EENADU
close

తాజా వార్తలు

మసకబారుతున్న ‘మేడిన్‌ చైనా’ ..!

 సైకిళ్ల తయారీ దిగ్గజం ‘జెయింట్‌’ వెల్లడి

బీజింగ్‌: ‘‘మేడిన్‌ చైనా’ యుగం ఇక ముగిసింది’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ప్రపంచంలోనే అత్యధికంగా సైకిళ్లను తయారు చేసే జెయింట్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ కో సంస్థ అధ్యక్షురాలు బొన్నె టూ. అమెరికాకు చెందిన ఆర్డర్ల కోసం పనిచేసే తయారీ కేంద్రాన్ని కూడా తైవాన్‌కు మార్చనున్నట్లు తెలిపారు. ‘‘మేడిన్‌ చైనా’ శకం ముగియటాన్ని గత ఏడాది గమనించాను. ప్రపంచానికి పంపిణీదారుగా చైనా పాత్ర ముగుస్తోంది.’’ అని బొన్నె టూ అన్నారు. గత ఏడాది ట్రంప్‌ 25శాతం టారీఫ్‌లు విధిస్తానని వెల్లడించగానే ఈ సంస్థ అప్రమత్తమైంది. చైనా నుంచి వలసపోతున్న అతిపెద్ద సంస్థల్లో ‘జెయింట్‌ ’ కూడా ఒకటి. ఇప్పటికే జెయింట్‌ సంస్థ  చైనాలోని మౌంటేన్‌ అండ్‌ రేసింగ్‌ సైకిళ్ల తయారీ ప్లాంట్‌ను హంగేరికి తరలించింది. ఇప్పటికే జెయింట్‌కు తైవాన్‌, నెదర్లాండ్ల్‌లలో ప్లాంట్లు ఉన్నాయి. ఇవికాక చైనాలో మరో ఐదు ప్లాంట్లు ఉన్నాయి. దక్షిణాసియాలో ఒక భాగస్వామి కోసం చూస్తున్నట్లు జెయింట్‌ తెలిపింది. 
చైనాలో ఒక సైకిల్‌ తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేయాలంటే  100 డాలర్ల వరకు టారీఫ్‌ చెల్లించాల్సి ఉంటుంది. అదే జీరో టారీఫ్‌ దేశాల నుంచి ఎగుమతి చేస్తే ఆమేరకు మిగులుతుంది. దీంతో ఆ సంస్థ తైవాన్‌కు వెళ్లనుంది. కాకపోతే తైవాన్‌లో ఉద్యోగులకు వేతనాలు ఎక్కవగా ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి తోడు విడిభాగాల సరఫరా కూడా అంత వేగంగా ఉండదు. చైనా-అమెరికా ట్రేడ్‌వార్‌లో నలిగిపోయే కంటే ఈ సమస్యలు ఏమంత పెద్దవి కావని జెయింట్‌ అభిప్రాయపడుతోంది.
జెయింట్‌ బాటలో మరికొన్ని సంస్థలు కూడా పయనించనున్నాయి. ఇంటెల్‌ కార్ప్‌ తన సరఫరాదారుల విషయంలో మరోసారి సమీక్షిస్తానని పేర్కొంది. దీంతోపాటు లిఅండ్‌ఫుంగ్‌ కార్ప్‌ సంస్థ కూడా వాణిజ్య యుద్ధం తమను చైనా నుంచి మరోవైపునకు వెళ్లేలా చేస్తోందని ప్రకటించింది. 

భారత్‌కు 200 కంపెనీలు..

భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో చైనాకు చెందిన 200 సంస్థలు భారత్‌కు వలసపోయే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ది యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ అండ్‌ పార్టనర్‌షిప్‌ ఫర్మ్స్‌ అధ్యక్షుడు ముఖేష్‌ అఘీ ఇటీవల పేర్కొన్నారు. రాబోయే 12-18 నెలల్లో కేవలం భారత్‌లో కొన్ని విధాన పరమైన మార్పులు తీసుకొస్తే భారీ సంఖ్యలో కంపెనీలు వలస వస్తాయని తెలిపారు. సంస్కరణలు, అనుమతులు వంటి వాటిని వేగవంతం చేయాలన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.