
తాజా వార్తలు
దిల్లీ: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. పశ్చిమబెంగాల్లో ఇటీవల వైద్యులపై జరిగిన దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యుల భద్రతపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. అయితే నిరసన చేపట్టిన వైద్యులు నిన్న సమ్మె విరమించడంతో ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.
‘పశ్చిమబెంగాల్ సహా దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మె చేపట్టిన నేపథ్యంలో పిటిషన్‌ను నేడు విచారించేందుకు అంగీకరించాం. అయితే సోమవారం వైద్యులు తమ సమ్మెను విరమించారు. ఇప్పుడు ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని అనిపిస్తోంది. కోర్టు సెలవుల అనంతరం ఈ పిటిషన్‌ను తగిన ధర్మాసనం ముందుకు తీసుకెళ్లండి’ అని కోర్టు ఆదేశించింది.
మరోవైపు భారత మెడికల్ అసోసియేషన్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వాసుపత్రులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించాలని కోరింది. మెడికల్ అసోసియేషన్ అభ్యర్థనపై విచారించిన న్యాయస్థానం.. దీనిపై సంపూర్ణ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘ఇది చాలా సీరియస్ అంశం. వైద్యుల భద్రతకు మేం వ్యతిరేకం కాదు. అయితే దీనిపై సంపూర్ణ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’ అని ధర్మాసనం వెల్లడించింది.
బెంగాల్‌లోని ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి ఇటీవల మృతిచెందాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రోగి బంధువులు వైద్యులపై దాడి చేయగా.. ఇద్దరు జూనియర్ డాక్టర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని నిరసిస్తూ ఎన్ఆర్ఎస్ కాలేజీలోని వైద్యులు సమ్మెకు దిగారు. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. సోమవారం విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. అయితే వైద్యుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హామీ ఇవ్వడంతో వారు సమ్మె విరమించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- కిర్రాక్ కోహ్లి
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- తీర్పు చెప్పిన తూటా
- రజాక్‌కు పఠాన్ చురకలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
