close

తాజా వార్తలు

తల్లి శవం పక్కన 6 నెలల చిన్నారి

థానె: మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హతమార్చారు. కొన్ని గంటల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఆరు నెలల చిన్నారి తల్లి మృతదేహం పక్కనే కనిపించడం స్థానికులను కలచివేసింది. 

సింతన్‌దేవి యాదవ్‌ (23) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు తలపై మోది హత్య చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఆమెతో పాటు ఆరు నెలల చిన్నారి మాత్రమే ఉంది. హత్య జరిగిన సమయంలో ఆఫీస్‌కు వెళ్లిన మృతురాలి భర్త.. రాత్రి 8 గంటలకు తిరిగొచ్చాడు. అప్పటికే విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించాడు. తల్లి శవం దగ్గరే ఆరు నెలల చిన్నారిని చూసి కన్నీరు మున్నీరయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.