close

తాజా వార్తలు

ప్రపంచకప్‌: గణాంకాల్లో ‘కోహ్లీసేన’

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ మూడు వర్షాలు.. ఆరు మ్యాచులతో తనదైన శైలిలో సాగుతోంది. మెగాటోర్నీలో ఆలస్యంగా తన ప్రయాణం ఆరంభించిన టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. వర్షంతో రద్దైన న్యూజిలాండ్‌ మ్యాచ్‌ను మినహాయిస్తే కోహ్లీసేన అభిమానులను చక్కగా అలరించింది. రోహిత్‌ శర్మ వీరోచిత బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. గాయంతో శిఖర్ ధావన్‌ టోర్నీకి దూరమయ్యాడు. భువీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. బుమ్రా విజృంభించి ఆడుతున్నాడు. తమ ఆటతీరుతో టీమిండియా క్రికెటర్లు ఇప్పటి వరకు నమోదు చేసిన గణాంకాలు మీకోసం..!

భారత్‌ 4 మ్యాచ్‌లు ఆడింది. దక్షిణాఫ్రికాపై 6 వికెట్లు, ఆస్ట్రేలియాపై 36 పరుగులు, పాకిస్థాన్‌పై 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో పోరు టాస్‌ పడకుండానే రద్దైంది.

ప్రపంచకప్‌లో టీమిండియా సాధించిన అత్యధిక పరుగులు 352/5. ఓవల్‌లో ఆసీస్‌పై చేసింది. మాంచెస్టర్‌లో పాక్‌పై 336/5తో నిలిచింది. ఇది రెండో అత్యధిక స్కోరు.

భారత్‌+ప్రత్యర్థి జట్టు కలిసి నెలకొల్పిన అత్యధిక పరుగులు 668. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో నమోదైంది. ఆ మ్యాచ్‌లో పడ్డ వికెట్లు 15.

టీమిండియా తరఫున ఎక్కువ పరుగులు చేసింది రోహిత్‌ శర్మ. 3 ఇన్నింగ్సుల్లో 319 పరుగులు చేశాడు. అత్యధిక సగటు 159.50 అతడిదే.

మెగాటోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రోహిత్‌ శర్మే చేశాడు. పాక్‌పై 140, దక్షిణాఫ్రికాపై 122* సాధించాడు.

భారత ఆటగాళ్లలో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ హార్దిక్‌ పాండ్యది. 3 ఇన్నింగ్సుల్లో 167.92 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు.

టీమిండియాలో ఎక్కువ శతకాలు చేసింది రోహిత్‌ శర్మ. దక్షిణాఫ్రికా, పాక్‌పై చెరో శతకం బాదాడు.

కోహ్లీసేనలో ఎక్కువ వికెట్లు తీసింది యుజువేంద్ర చాహల్‌. 27 ఓవర్లు విసిరి 166 పరుగులు ఇచ్చాడు. 6.14 ఎకానమీతో 6 వికెట్లు తీశాడు. బుమ్రా, భువి చెరో 5 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నెలకొల్పిందీ చాహలే. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో 51 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఆసీస్‌పై బుమ్రా, భువీ చెరో 3 వికెట్లు తీశారు.

భారత్‌ జట్టులో ఎక్కువ క్యాచ్‌లు అందుకుంది కోహ్లీ. 3 ఇన్నింగ్సుల్లో 3 అందుకున్నాడు. చాహల్‌ 2 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.

పాక్‌పై కేఎల్‌  రాహుల్‌, రోహిత్‌ శర్మ తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పరుగులు, వికెట్ల పరంగా ఇదే అత్యధికం. అదే మ్యాచ్‌లో రోహిత్‌, కోహ్లీ రెండో వికెట్‌కు 98 పరుగులు చేశారు.

గమనిక: ఈ గణాంకాలన్నీ అఫ్గాన్‌తో మ్యాచ్‌ ముందు వరకే..

-ఇంటర్నెట్‌ డెస్క్‌ 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.